Saturday, October 5, 2024
HomeNewsKurnool Collector: రీ సర్వే, స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేయండి

Kurnool Collector: రీ సర్వే, స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేయండి

జీరో పురోగతి నమోదు చేయడం ఏంటి?

భూముల రీ సర్వే కి సంబంధించి స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఇంజనీర్లతో హౌసింగ్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీ సర్వే కి సంబంధించి స్టోన్ ప్లాన్టేషన్లో ఒక్క రోవర్ కి 100 స్టోన్స్ ప్లాంటేషన్ చేయాలని చెప్పడం జరిగిందని, కొన్ని గ్రామాల్లో 100 కి పైగా చేస్తుంటే కొన్ని గ్రామాలు మాత్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడం లేదని ముఖ్యంగా గూడూరు, కోడుమూరు మండలాలు తక్కువగా చేస్తున్నారని ఈ విధంగా చేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరన్నారు. రోవర్ కి 100 కి పైగా స్టోన్ ప్లాంటేషన్ చేస్తే తప్ప నిర్దేశించిన లక్ష్యాలను సాధించలేమని, ఇప్పటినుండి రోవర్ కి 100 కి తక్కువగా ఎవరైనా చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.హౌసింగ్ కు సంబంధించి బిలో బేస్మెంట్ లెవెల్ స్థాయి నుండి బేస్మెంట్ స్థాయికి జీరో పురోగతి నమోదు చేసిన ఆస్పరి, కోడుమూరు ఎంపిడిఓలతో మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలు రోజుకి 5, 3 ఉన్నప్పటికీ కూడా జీరో పురోగతి నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తూ పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలనన్నారు. అదే విధంగా బేస్మెంట్ లెవెల్ స్థాయి నుండి కంప్లీషన్ స్థాయికి జీరో పురోగతి నమోదు చేసిన గోనెగండ్ల, కౌతాళం, ఆదోని హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లతో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన వాటిలో కూడా స్టేజ్ కన్వర్షన్ చేయడంలో జీరో పురోగతి నమోదు చేయడం ఏంటని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి కావాల్సిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కౌతాళం, వెల్దుర్తి, ఓర్వకల్లు, ఎమ్మిగనూరు మండలాల్లో పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మిగనూరు, కౌతాళం మండలాల్లో గ్రౌండింగ్ శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓలను అదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించి చివరి దశలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న బిల్స్ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న “ఆరోగ్య సురక్ష” కి సంబంధించి పెండింగ్ లో ఉన్న మండలాల్లో శిబిరాల షెడ్యూల్ ప్రణాళిక పూర్తి చేశారా లేదా అని డిఏంహెచ్ఓ ని ఆరా తీశారు. ఇంకా ఏ మండలాల్లో అయిన పెండింగ్ లో ఉంటే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ సి.బెళగల్, గార్గేపురం, కర్నూల్ రూరల్ గ్రామాలు రేపు ఉదయం లోపు పైనల్ ఆర్ఓఆర్ పబ్లిష్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసిల్దారులను ఆదేశించారు. రీ సర్వే కి సంబంధించి విలేజ్ సర్వేయర్, విఆర్ఓ లాగిన్ లో పెండింగ్ లో ఉన్న డేటా ఎంట్రీ చేయడంలో కేటాయించిన సమయం కంటే ఎక్కువగా తీసుకుంటున్నారని ముఖ్యంగా నందవరంలోని పెద్దకొత్తిలి, నాగులదిన్నె గ్రామాలు, పత్తికొండలోని చక్రాల గ్రామం, ఆదోనిలోని దిబ్బనకల్ గ్రామం, మద్దికేర లోని హంప గ్రామాలు సమయం ఎక్కువగా తీసుకుంటున్నారని, నిర్దేశించిన సమయంలోపే పూర్తి చేయాలని లేకపోతే చర్యలు తప్పవన్నారు. టెలికాన్ఫరెన్స్లో ఇంఛార్జి హౌసింగ్ పిడి సిద్ధలింగ మూర్తి, పంచాయతీరాజ్ ఎస్.ఈ సుబ్రహ్మణ్యం, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News