ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ (Lalit Modi) ఎట్టకేలకు తాను దేశం విడిచి వెళ్లడంపై స్పందించారు. అంతా భావిస్తున్నట్టు తాను న్యాయపరమైన చిక్కుల వల్ల దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బెదిరింపుల వల్లే ఇండియా విడిచి వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
తాను దేశం విడిచి వెళ్లేందుకు చట్ట పరమైన అంశాలు ఏవీ లేవని లలిత్ మోదీ వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణహాని కారణంగానే విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. దావూద్ మ్యాచ్ లు ఫిక్స్ చేయాలనుకున్నాడని, అందులో తనకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనకి ప్రాణహాని కల్పించేందుకు దావూద్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని చెప్పుకొచ్చారు. ఎలాంటి అవినీతి లేకుండా నిబద్ధతతో కూడిన ఆటే తనకి ముఖ్యమని లలిత్ మోదీ (Lalit Modi) వ్యక్తం చేశారు. తాను తిరిగి ఇండియాకి రావడం రావడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనపై ఒక్క కేసు కూడా లేదని వెల్లడించారు. కాగా 2010లో భారత్ ను వీడిన లలిత్ మోదీ ప్రస్తుతం లండన్లో నివాసం ఉంటున్నారు.