అకాల వర్షం కురిసి అన్నదాతను అప్పుల పాలు చేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం మండలంలో వేడి నుండి ఉపశమనం కలిగించిందని ఆశించిన మండల ప్రజలకు వేడి నుండిఊరట లభించిన మరికొంతమంది రైతులకు కన్నీరు తెప్పించింది. వ్యవసాయ బావుల కింద పంటలు వివిధ రకాల పంటలు సాగు చేశారు. అయితే మండల పరిధిలోని ఎం అగ్రహారం గ్రామానికి చెందిన రైతులు తుమ్మిటి హనుమంతు తుమ్మిటి కృష్ణ తోపాటు పలువురు రైతులు మొక్కజొన్న సాగు చేశారు. పై ఇరువురి రైతులు 8 ఎకరాలలో రెండు లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసి, ఆరుగాలం కష్టపడి దిగుబడి చేతికొచ్చే సమయంలో ఉన్నపళంగా వర్షాలు కురవడంతో చేతికొచ్చిన పంట మొత్తం పొలమంతా నీరు చేరి పాడైపోవడంతో గింజలు మొలకెత్తి దీంతో పెట్టేన పెట్టుబడులు పండిన పంట చేతికి రాక వర్షపు నీటి పాలు కావడంతో అన్నదాతల ఆశలు ఆవిరైపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అకాల వర్షాల వల్ల పంట అంతా నీటి పాలు కావడంతో అప్పులు మిగిలాయని, రైతులు కన్నీటి పర్వతమయ్యారు. మాకు పరిహారం ఇవ్వాలి మాకు ఉన్నంతలో అప్పులు చేసి, బోరు బావుల కింద పొలాలను కౌలు కింద చేసి, విత్తన సాగు చేస్తే పంట దిగుబడి చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పంట అంతా నీటిపాలు త్రీవంగా నష్టపోయాం. అందువల్ల ప్రభుత్వమాకు పరిహారమందు చేయాలంటూ బాధిత రైతులంతా డిమాండ్ చేస్తున్నారు.