Friday, September 20, 2024
HomeNewsMallapur: రాబోవు రోజుల్లో మహా దైవ క్షేత్రంగా కొత్త ధాంరాజ్ పల్లి:చెన్నమనేని శ్రీనివాస రావు

Mallapur: రాబోవు రోజుల్లో మహా దైవ క్షేత్రంగా కొత్త ధాంరాజ్ పల్లి:చెన్నమనేని శ్రీనివాస రావు

కొత్త దాంరాజు పల్లి గ్రామంలో గ్రామ సేవా సమితి సభ్యులు, గ్రామ ప్రజలు ప్రతి నెలా మొదటి సోమవారం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటిసారి సిఎస్ఆర్ తమ గ్రామానికి రావడంతో గ్రామ ప్రజలు గ్రామ యువకులు గ్రామ సేవా సమితి సభ్యులు మహిళలు మంగళ హరతులతో, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. శివాలయంలో సిఎస్ఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్తులతో కలిసి అన్నదానంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా అన్నదాన కార్యక్రమానికి హాజరైన సిఎస్ఆర్, ఎస్సై గోస్కే నవీన్ కుమార్ లకు గ్రామ సేవా సమితి సభ్యులు శాలువాతో సత్కరించి, తమ గ్రామ దేవాలయ చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం గ్రామ నది ఒడ్డున నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని సిఎస్ఆర్ పరిశీలించారు. అద్భుతమైన కట్టడం గ్రామంలో ఉండటం ఈ గ్రామ ప్రజల పూర్వజన్మ సుకృతం అని, ఈ ఆలయం మరో వేములవాడ కాబోతుందని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. పంట చేనుల మధ్యన, గోదావరి నది ఒడ్డున నిర్మితమవుతున్న అద్భుతమైన ఆలయం అని అందరూ చేయీ చేయీ కలిపి ఆలయం పూర్తవడంలో తమ వంతు పాత్ర పోషించాలని గ్రామస్తులకు తెలిపారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాల వేసి గ్రామ యువకులతో, గ్రామ పెద్ద మనుషులతో గ్రామ బాగోగుల గురించి చర్చించారు. గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని, మీ గ్రామాభివృద్ధిలో తన వంతు పాత్ర తప్పకుండా ఉంటుందని గ్రామస్తులకు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత కమలాకర్ రెడ్డి ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి, కోరుట్ల నియోజకవర్గ టిపిసిసి నాయకులు కాట్పల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ లతా గంగాధర్, గ్రామ సేవా సమితి సభ్యులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డి, శ్రీధర్, రాజారెడ్డి, రాకేష్, గణేష్, ప్రభాకర్, రాజేందర్, సంతోష్ గ్రామ యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News