Maratha Quota: ఓబీసీ రిజర్వేషన్లలో మరాఠాలకు కోటా (Maratha Quota in reservation) 10 శాతం కేటాయించాలని సామాజిక కార్యకర్త మనోజ్ జరాంజే ముంబైలో నిరాహార దీక్ష చేస్తున్నారు. మనోజ్‌తో పాటు అతని అనుచరులు, కార్యకర్తలకు మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆజాద్ మైదాన్‌తోపాటు ముంబైని విడిచి వెళ్లాలని ఆ నోటీసులో సూచించారు. నిరాహార దీక్ష మంగళవారానికి ఐదో రోజుకు చేరుకున్నది. నిరసన ప్రదర్శన కోసం కేవలం ఐదు వేల మందికి పర్మిషన్ ఇచ్చారు. అయితే మనోజ్ దీక్ష చేస్తున్న ముంబైలోని ఆజాద్ మైదాన్‌కు సుమారు 40 వేల మంది నిరసనకారులు చేరుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. బాంబే హైకోర్టు మార్గదర్శకాలను బేఖాతరు చేయడం వల్ల ముంబై పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ముంబై వీదుల నుంచి మరాఠా కోటా మద్దతుదారులు వెళ్లిపోవాలని హైకోర్టు ఈ నోటీసుల్లో స్పష్టం చేసింది. మరాఠా కోటీ ఉద్యమం వల్ల ముంబై నగరం స్తంభించిపోయినట్లు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కోర్టు చెప్పింది.
ALSO READ:https://teluguprabha.net/national-news/delhi-yamuna-floods-red-alert/
సాయంత్రం 4 గంటల కల్లా ముంబై వీధులను ఖాళీ చేయాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు: మనోజ్ హెచ్చరిక
తాను ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మనోజ్ మంగళవారం ఉదయం ప్రకటించారు. అయితే స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని.. బలవంతంగా ఖాళీ చేయిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పోలీసులను హెచ్చరించారు.
కాగా ఐదు రోజులుగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మరాఠా రిజర్వేషన్ల కోసం మనోజ్ నాయకత్వంలో ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది నిరసనకారులు దక్షిణ ముంబైకి చేరుకోవడంతో.. సీఎస్‌టీ, ఫోర్ట్, చర్చిగేట్ తదితర మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిరసనకారులు పలు మార్గాలను బ్లాక్ చేశారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కాగా ఈ నిరసనలపై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిరసనలు శాంతియుతంగా జరగడం లేదని.. నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారని పేర్కొంది. ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్, అతడి మద్దతుదారులు ముంబై వీధులను మంగళవారం సాయంత్రం 4లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది.
ALSO READ:https://teluguprabha.net/national-news/pm-modi-semicon-india-2025-delhi/
మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న తన డిమాండ్ నెరవేరే వరకూ ముంబై విడిచి వెళ్లబోనని మనోజ్ జరాంగే పాటిల్ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగతా మరాఠాలు ముంబై చేరుకుంటున్నారు. కొంతమంది ఆయన అనుచరులు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
మరాఠాలను కున్బీలుగా గుర్తించి ఓబీసీ జాబితాలో చేర్చాలని మనోజ్ డిమాండ్ చేస్తున్నారు. తమ ఉద్యమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


