ముంబై, సెప్టెంబరు 1 (తెలుగు ప్రభ): మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం కూలిన ఘటనపై రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఉద్దేశించి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే పలు వ్యాఖ్యలు చేశారు. శివాజీ విగ్రహం కూల్చివేతపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పడం అతని అహంకారానికి చిహ్నమని, రాష్ట్ర ప్రజలు దానిని తిరస్కరించారని అన్నారు. శివాజీ మహరాజ్ విగ్రహం పడిపోవడానికి, అయోధ్యలోని రామ మందిరంలోకి నీరు కారడానికి మధ్య సారూప్యత ఉందన్నారు.