Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభMohan Babu: జర్నలిస్టుపై దాడి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మోహ‌న్ బాబు

Mohan Babu: జర్నలిస్టుపై దాడి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మోహ‌న్ బాబు

Mohan Babu| జర్నలిస్టుపై దాడి ఘటనపై నటుడు మోహన్ బాబు లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ఈమేరకు సదరు మీడియా సంస్థకు లేఖ రాశారు. ఇటీవల తన నివాసంలో జరిగిన దురదృష్టకర సంఘటనపై విచారం వ్యక్తంచేస్తూ ఈ లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

‘ఈ ఘటనలో జర్నలిస్ట్‌ సోదరుడికి బాధ కలిగించినందుకు నాకు కూడా బాధగా ఉంది. ఇది జరిగిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల 48 గంటలు ఆసుపత్రిలో చేరడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. నేను అతడి సహనాన్ని అభినందిస్తున్నాను. ఆరోజు నా ఇంటి గేటు విరిగిపోయి.. దాదాపు 50 మంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. దీంతో నేను సహనాన్ని కోల్పోయాను. ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. నేను పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఓ జర్నలిస్ట్‌కు గాయమైంది. ఇది చాలా దురదృష్టకరం. అతడితో పాటు అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని లేఖలో రాసుకొచ్చారు

కాగా జల్‌పల్లిలో మోహన్‌బాబు (Mohan Babu) నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ దంపతులో పాటు నివాసంలోకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టుపై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే మోహ‌న్ బాబుపై పోలీసులు హ‌త్యాయ‌త్నం కేసు కూడా న‌మోదు చేసిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News