Akhanda: సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ సాధించిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో ఇప్పుడు అఖండ2తో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకుంది. అన్ని పనులు వేగంగా జరిపి, సెప్టెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. బాలయ్య సినిమాల విషయంలో రిలీజ్ డేట్‌ను ఖచ్చితంగా పాటించడం ఆయన స్టైల్. అందుకే ఈ రిలీజ్ తేదీని మరోసారి నిర్ధారించారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.
తాజాగా ‘అఖండ 2’కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్టర్ ప్లాన్ వేశారు. బాలయ్యతో ఉన్న సక్సెస్ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా, కథలో కంటిన్యూటీని కొనసాగిస్తుంది. అయితే, ఈ సినిమాలో ప్రీక్వెల్‌కు సంబంధించిన కొన్ని సూచనలు కూడా ఉంటాయని తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను కథను సిద్ధం చేస్తున్నప్పుడే ప్రీక్వెల్ లీడ్స్‌ను రెడీ చేశారట. ‘అఖండ 2’లో ఈ సూచనలు చాలా చోట్ల కనిపిస్తాయని సమాచారం. ప్రీక్వెల్ అంటే ‘అఖండ’కు ముందు జరిగిన కథను సూచిస్తుంది, ఆ కథకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఈ రెండో భాగంలో ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/news/hari-hara-veeramallu-release-date/
‘అఖండ’లో బాలయ్య పోషించిన అఘోర పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అయితే, ప్రీక్వెల్‌లో బాలయ్య పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. అఘోర కాన్సెప్ట్‌తోనే వస్తాడా? లేక రుషి తరహా పాత్రలో కనిపిస్తాడా? అన్నది సస్పెన్స్‌గా మిగిలింది. ఈ విషయంపై స్పష్టత కావాలంటే ‘అఖండ 2’ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇప్పటికే బాలయ్య అఘోర గెటప్‌లరిస్తోంది. అఘోర పాత్రల్లో బాలకృష్ణ ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అదీ నటసింహం యొక్క స్పెషలిటీ!
అఖండ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌ను బేస్ చేసుకుని అఖండ2ని అన్ కాంప్రమైజ్డ్‌గా భారీ బడ్జెట్‌తో అఖండ2 నిర్మిస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా వచ్చిన మూవీ టీజర్ సినిమా అంచనాలను మరింత పెంచాయి. ఇప్పుడు అఖండ3 అంటూ ప్రీక్వెల్ గురించిన సమాచారం కూడా వైరల్ అవుతుంది. కాంతార చిత్రానికి ప్రీక్వెల్ రూపొందుతున్నట్లే అఖండ చిత్రానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కించాలనే ఆలోచనైతే ఉంది. కానీ దీనికి ఇంకా సమయం ఉంది. మరి అఖండ2 రిలీజ్ తర్వాత సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి అఖండ3పై నిర్ణయం ఉంటుందనటంలో సందేహం లేదు.