Saturday, November 15, 2025
HomeNewsBloody Romeo: నాని, సుజీత్ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే ఫైనల్!

Bloody Romeo: నాని, సుజీత్ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే ఫైనల్!

Nani: నేచురల్ స్టార్ నాని మరియు ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్‌గానే పూజతో మొదలైన ఈ సినిమా కోసం ఇప్పుడు మరింత పవర్ ఫుల్ కాస్టింగ్ సెట్ అవుతోంది.

- Advertisement -

నాని సరసన స్టార్ హీరోయిన్ ఫిక్స్!

టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సంచలన చిత్రంలో నాని సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతున్నారు! ఈ బుట్టబొమ్మకు ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ ఫ్రెష్ కాంబో టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారి తీసింది. నాని ఎప్పుడూ కొత్త హీరోయిన్లతో ప్రయోగాలు చేస్తుంటారు, కానీ పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్‌తో మొదటిసారి జట్టు కట్టడం సినిమా స్థాయిని అమాంతం పెంచింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/akhanda-2-bhagavadgita-shlokas-by-dr-gangadhara-sastry/

డైరెక్టర్ సుజీత్ మాస్టర్ ప్లాన్!

‘రన్ రాజా రన్’తో ప్రశంసలు, ‘ఓజీ’తో మాస్ హిట్‌ను అందుకున్న దర్శకుడు సుజీత్… నానితో చేయబోయే సినిమాను కూడా చాలా స్టైలిష్‌గా, పవర్ ప్యాక్‌డ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని చేకూర్చేందుకు, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం! ఈ భారీ కాస్టింగ్ చూస్తుంటే, సుజీత్ ఒక పాన్ ఇండియా రేంజ్ సినిమానే సిద్ధం చేస్తున్నారని అర్థమవుతోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/diwali-2025-box-office-race-telugu-movies/

రిలీజ్ టార్గెట్ ఫిక్స్?

వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. దీపావళి తర్వాత నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని యూనిట్ చెబుతోంది. కొంతకాలంగా తెలుగులో పెద్దగా కనిపించని పూజా హెగ్డేకు, నాని – సుజీత్ కాంబోలో వచ్చిన ఈ అవకాశం.. ఆమె కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది.
మొత్తానికి, నాని, పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ జత కడుతున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి! ఈ కొత్త జోడీ, సుజీత్ టేకింగ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad