New voter card application: మనకు జీవితంలో ఆధార్ కార్డు తర్వాత అత్యంత ప్రాముఖ్యమున్న ఐడెంటిటీ కార్డు ఏదైనా ఉంది అంటే అది ఓటర్ కార్డే. నిజానికి ఓటర్ కార్డు అనేది ఒక ఆయుధం. ఓటు అనే ప్రాథమిక హక్కు ద్వారానే మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం. ఓటర్ కార్డు ఉండటం వలనే ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కును వినియోగించుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మీ శక్తిని చూపించడానికి సాధనంగా ఉంటుంది.
ఓటర్ అనేది ఓ గుర్తింపు పత్రం (Identity Proof):
ఓటర్ ఐడీని గవర్నమెంట్ గుర్తించిన గుర్తింపు పత్రంగా ఉపయోగించవచ్చు. బ్యాంకు ఖాతా తెరవడానికి, పాస్‌పోర్ట్ అప్లై చేసేందుకు, లేదా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది ఉపయోగ పడుతుంది.
సోషల్ ఐడెంటిటీ:
ఓటర్ కార్డు ద్వారా మీరు సమాజంలో చట్టబద్ధ పౌరుడిగా గుర్తింపును పొందుతారు.
అయితే కొత్తగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారు ఓటర్ కార్డు లేక ఎలా అప్లై చేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. వీరిలాగే మరికొంత మంది ఏవో కారణాల ఓటర్ కార్డు క్యాన్సిల్ అయి ఉంటారు. పలు రాష్టలో రాబోయేవి గ్రామ ఎన్నికలు. అందుకే కేంద్రం వీటిని దృష్టిలో పెట్టుకుని ఓటర్ కార్డు జారీ కోసం విధి విధానాలను సులభం చేసింది. సరైన ధ్రువపత్రాలతో అప్లై చేసుకున్న వారికి 15 రోజుల్లో ఓటర్ కార్డును నేరుగా ఇంటికే పంపించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరి ఆ అప్లికేషన్ విధానం ఏంటో ఇప్పుడు చూద్దామా..
ఓటర్ కార్డు అప్లికేషన్ విధానం
మీరు కొత్త ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
- ఆన్ లైన్లో దరఖాస్తు చేయడం ( NVSP Website)
స్టెప్ 1: https://www.nvsp.in వెబ్‌సైట్‌కి వెళ్ళండి
స్టెప్ 2: “Apply online for registration of new voter” (Form 6) ఎంపికను క్లిక్ చేయండి
స్టెప్ 3: మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోటో తదితరాలను ఎంటర్ చేయండి
స్టెప్ 4: అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి (ఆధార్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో)
స్టెప్ 5: సమర్పించిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడీ వస్తుంది. నోట్ చేసి పెట్టుకోండి. దీని ద్వారా స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు.
- బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) ద్వారా:
మీరు మీ ప్రాంతంలోని బీ ఎల్ ఓ ను కలవండి. వారి కార్యాలయానికి వెళ్లి, ఫామ్-6 ను తీసుకొని మీ డీటెయిల్స్ ను ఫిల్ చేసి, తగిన గుర్తింపు పత్రాలు జత చేసి అందించండి. బీ ఎల్ ఓ.. మీ నివాసాన్ని, మిమ్మల్ని వెరిఫై చేసి, మీకు ఓటర్ ఐడీ జారీ చేస్తారు.
ఓటర్ ఐడీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు:
- ఆధార్ కార్డు / పాన్ కార్డు (గుర్తింపు పత్రం)
- అడ్రస్ ప్రూఫ్ (ఉదా: విద్యుత్ బిల్, రేషన్ కార్డు)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- పుట్టిన తేదీ కన్ఫర్మేషన్ సర్టిఫికెట్ (ఉదా: బర్త్ సర్టిఫికెట్ లేదా 10వ తరగతి మెమో)
ఓటర్ ఐడీ స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోవచ్చు.
https://www.nvsp.in వెబ్సైట్ లోకి “Track application status” సెక్షన్‌కి వెళ్ళి, మీ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ నమోదు చేసి స్టేటస్ తెలుసుకోండి.