Nidhhi Agerwal: హరిహర వీరమల్లు మూవీతో దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్ హీరోగా హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీపై నిధి అగర్వాల్ బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్ల లీగ్‌లో చేరాలని కలలు కన్నది. హరిహర వీరమల్లు డిజాస్టర్‌తో ఆమె కలలు తీరలేదు. భారీ అంచనాల నడుమ రిలీజైన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి నిధి అగర్వాల్‌కు నిరాశను మిగిల్చింది.
జూలై సెంటిమెంట్…
ఈ సారి జూలై సెంటిమెంట్ కూడా నిధి అగర్వాల్‌కు కలిసి రాలేదు. తెలుగులో ఇప్పటివరకు నిధి అగర్వాల్ ఐదు సినిమాలు చేయగా… ఇస్మార్ట్ శంకర్ ఒక్కటే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 85 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. 2019లో టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇస్మార్ట్ శంకర్…
ఇస్మార్ట్ శంకర్ మూవీ జూలై నెలలోనే రిలీజైంది. హరిహర వీరమల్లు కూడా జూలైలోనే ప్రేక్షకుల ముందుకు రావడంతో బ్లాక్‌బస్టర్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నిధి అగర్వాల్ అభిమానులు భావించారు. కానీ ఇస్మార్ట్ తరహాలో హరిహర వీరమల్లు బాక్సాఫీస్ జోరు చూపించలేకపోయింది.
ఐదేళ్లు టైమ్…
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ దాదాపు ఐదేళ్లు టైమ్ కేటాయించింది. హరిహర వీరమల్లు పూర్తయ్యే వరకు మరో సినిమాను అంగీకరించకూడదంటూ మేకర్స్ ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారట. తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా ఈ అగ్రిమెంట్ కారణంగా వాటిని రిజెక్ట్ చేసిందట నిధి అగర్వాల్. ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను సోలోగా తన భుజాలపై వేసుకుంది. నిధి అగర్వాల్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పడుతున్న కష్టం చూసి తనకే సిగ్గేసిందని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నాడు.
పంచమి పాత్రలో…
హరిహర వీరమల్లులో పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించింది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో అదరగొట్టింది. నిధి పాత్రలోని ట్విస్ట్ థియేటర్లలో ఆడియెన్స్‌కు మంచి హై ఇచ్చింది. గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. సినిమా కోసం ఏం చేయాలో అన్ని చేసింది నిధి అగర్వాల్. కానీ ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కలేదు.
ప్రభాస్ రాజాసాబ్‌లో…
హరిహర వీరమల్లు తర్వాత ప్రభాస్ రాజాసాబ్‌లో ఓ హీరోయిన్‌గా కనిపించబోతున్నది నిధి అగర్వాల్. హారర్ కామెడీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్ పాత్రకు సంబంధించిన పోర్షన్స్ పూర్తయినట్లు సమాచారం. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అందుకోవాలనే నిధి కల ఈ సినిమాతోనైనా తీరుతుందో లేదో చూడాల్సిందే. రాజాసాబ్‌లో నిధి అగర్వాల్‌తో పాటు మాళవికా మోహనన్ మరో హీరోయిన్‌గా కనిపించనుంది.
నిధి అగర్వాల్ జూలై నెల సెంటిమెంట్ ఈ సారి కలిసిరాలేదు. నిధి అగర్వాల్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీ జూలైలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూలైలోనే రిలీజైన లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.


