Tuesday, November 26, 2024
HomeTS జిల్లా వార్తలునిర్మల్Nirmal: మా నేతలు కనిపించటం లేదంటూ భారీ రాస్తా రోకో

Nirmal: మా నేతలు కనిపించటం లేదంటూ భారీ రాస్తా రోకో

పురుగు మందుతో..

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ రాస్తారోకో సాయంత్రం దాకా కొనసాగుతూనే ఉంది.

- Advertisement -

చేతిలో పురుగు మందుతో

తెల్లవారుజామునే మహిళలు, పురుషులు చేతుల్లో పురుగు మందు డబ్బాలలో రాస్తారోకో చేపట్టారు. దిలావర్ పూర్ – గుండంపల్లి మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేస్తూ భైంసా – నిర్మల్ రహదారిపై నిర్వహించిన ఈ ధర్నాతో రోడ్డుపై వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఫలితంగా పోలీసు శాఖ గొల్లమాడ, బీరవెల్లి మీదుగా రాకపోకలను కొనసాగించారు. నిరసనలో భాగంగా మంగళవారం రోజున మండల బంద్ కు పిలుపునిచ్చారు.

ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వినకుండా

ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వినకపోగా తమ రాస్తారోకో కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపే దాకా తమ నిరసనలు కొనసాగిస్తామని వారంటున్నారు. దీంతో ఫ్యాక్టరీ వైపు వెళ్లే మార్గం పోలీసు దిగ్బంధంలోకి వెళ్ళింది. నిరసనకారులకు నచ్చజెప్పేందుకు నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి వెళ్లారు. ఆమెను మహిళలు ఘెరావ్ చేసి నిరసన వ్యక్తం చేశారు. గత నెలరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తూ తమ వ్యతిరేకత చాటుతున్నా ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోనందుకు నిరసన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్ ఏ మహేశ్వర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు కనిపించటం లేదంటూ వారి చిత్రపటాలతో ప్లకార్డులు చేత పట్టుకొని నిరసన వెలిబుచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News