ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా వెయ్యి కోట్లు రూపాయల నిధులను తీసుకువచ్చి హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించండి అని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన స్పోర్ట్స్ కిట్స్ తో పాటు, మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… యువతకు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి యువత పిడదోవన పోకుండా ఉండేందుకు స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చి వాటితో ఆడడం వలన మానసిక ఉల్లాసం కాకుండా ఆరోగ్యానికి మంచిదని వారిని ప్రోత్సహించే విధంగా ఈ కిడ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు హుజరాబాద్ నియోజకవర్గంలో 138 క్రికెట్ కిట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
మినీ కలెక్టరేట్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లను నిర్మించుకుందామని తెలిపారు. దీంతో పాటు పదివేల కోట్ల రూపాయలతో మినీ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు ప్రతి పాదనలు సిద్ధం చేశామని అన్నారు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు సహాయం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక్క అవకాశం ఇస్తే హుజురాబాద్ పట్టణాన్ని మరో సిద్దిపేటగా మార్చి తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. కోట్ల రూపాయల సంక్షేమ నిధులు అందరికీ అందేటట్లు చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, ఎంపీపీ ఇరుమల రాణి, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక, ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.