Thursday, July 4, 2024
HomeNewsవైరల్ అవుతున్న 'సలార్' న్యూ అప్డేట్..

వైరల్ అవుతున్న ‘సలార్’ న్యూ అప్డేట్..

KGF తో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా ప్రశాంత్ నీల్..ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు ఉన్నాయో..మాటల్లో చెప్పలేము. ఈ సినిమా షూటింగ్ ఒకేసారి తెలుగు మరియు కన్నడ భాషలలో జరుగుతుంది. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

- Advertisement -

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై చాల రోజులు అవుతున్న..ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ తెలుపకపోయేసరికి అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో సినిమా తాలూకా టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అప్డేట్స్ ఫిలిం సర్కిల్లో వైరల్ గా మారాయి.

‘సలార్’ చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నారట. ఆ తర్వాత నుండి వరుస అప్డేట్స్ ను అభిమానులతో పంచుకోబోతారని అంటున్నారు. ఇదే నిజమైతే అభిమానులకు పెద్ద పండగ మొదలైనట్లే.

ఇక ప్రభాస్ నుండి వచ్చిన ఆదిపురుష్ విషయానికి వస్తే..టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్లు వసూళ్లు చేసినట్లు చెపుతున్నారు. అయితే ఈరోజు సోమవారం నుండి ఆదిపురుష్ కు అసలైన పరీక్ష మొదలుకానుంది. సినిమా కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మూడు రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ , వీకెండ్ తో సాఫీగా సాగిపోయింది. మరి ఈరోజు నుండి కలెక్షన్లు ఎలా వస్తాయనేది చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News