Thursday, July 4, 2024
HomeNewsRain alert: మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు

Rain alert: మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

- Advertisement -

విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి

దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

  • డా. బిఆర్ అంబేద్కర్, ఎండి,ఏపీ విపత్తుల సంస్థ అంచనా ప్రకారం ఇవాళ మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి.

“పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదు

-డా. బిఆర్ అంబేద్కర్, ఎండి,ఏపీ విపత్తుల సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News