Sunday, November 16, 2025
HomeNewsReal time gold ATM: హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎంలు, 24/7 గోల్డ్ డ్రా చేయచ్చు

Real time gold ATM: హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎంలు, 24/7 గోల్డ్ డ్రా చేయచ్చు

గోల్డ్ సిక్కా లిమిటెడ్ సంస్థ గోల్డ్ ఏటీఎం సర్వీస్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేస్తోంది. ఇండియాలో ఇలాంటి వెరైటీ సర్వీస్ ఫస్ట్ టైం హైదరాబాద్ కు వస్తుండటం ఇంట్రెస్టింగ్ కదా. యూజవల్ గా ఇలాంటివి ఏ దుబైలోని ఉంటాయని మనం అనుకుంటాం. ఈ కంపెనీ ఇచ్చే ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ స్మార్ట్ కార్డ్స్ ద్వారా గోల్డ్ కొనచ్చు. ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినంత ఈజీగా డే అండ్ నైట్ ఎప్పుడైనా గోల్డ్ కొనేయచ్చు. ట్విన్ సిటీస్ లో 3 ఏటీఎంలను 3 డిఫరెంట్ ప్లేసెస్ లో డిసెంబర్ 3వ తేదీన అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మెషిన్ లో 5 కేజీల గోల్డ్ఉంటుంది. 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు గోల్డ్ చిటికెల్లో కొనేయవచ్చు. ఇలా ఏటీఎంలో గోల్డ్ కొనే టైంలో హాల్ మార్క్ బీఐఎస్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్న డీటైల్స్ కూడా డిస్ ప్లేలో మీకు కనిపిస్తాయి. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 3000 గోల్డ్ ఏటీఎంలను అందుబాటులోకి తేనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad