Samsung Galaxy A06 5G: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే మీకో గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ లో శామ్‌సంగ్ గెలాక్సీ A06 5జీ పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. 5,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ రూ. 10 వేల కంటే తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు శామ్‌సంగ్ గెలాక్సీ A06 5జీ ఫోన్ కు సంబంధించి ధర, ఆఫర్లు, ఫీచర్ల గురుంచి వివరంగా తెలుసుకుందాం.
ధర & ఆఫర్‌లు
శామ్‌సంగ్ గెలాక్సీ A06 5జీ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.9,999కి విడుదల అయింది. ఇప్ప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,210కి జాబితా చేయబడింది. ఇక బ్యాంక్ ఆఫర్‌ల చూస్తే..SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు (రూ.1,000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.8,289 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత తక్కువ ధరకే కొనొచ్చు.
ఫీచర్లు
శామ్‌సంగ్ గెలాక్సీ A06 5జీ 6.7-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది.ఈ ఫోన్ 900×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 800 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా సెటప్ గురుంచి మాట్లాడితే.. వెనుక భాగంలో f1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.