Thursday, September 19, 2024
HomeNewsSasank: సత్వరం 'గ్రీవెన్స్' దరఖాస్తులను పరిష్కరించాలి

Sasank: సత్వరం ‘గ్రీవెన్స్’ దరఖాస్తులను పరిష్కరించాలి

గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన నాయిని నాగరాజు తను వికలాంగుడునని తనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉన్నదని వికలాంగుల కోటాలో ఔట్సోర్సింగ్ లో ఏదైనా జాబ్ ఇప్పించగలరని తను ఇంటర్మీడియట్ పాసై ఉన్నానని స్వయం ఉపాధి కోసం వికలాంగుల కోటాలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ రుణం మంజూరు కాలేదని కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని ఏదైనా ఔట్సోర్సింగ్ నియామకంలో ప్రాధాన్యత ఇచ్చి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
మహబూబాబాద్ పట్టణంలో ఎన్జీ ఓస్ కాలనీకి చెందిన శ్యామకూరి జ్యోతి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ నాలేడ్జీ ఉండి నిరుద్యోగురాలిగా ఇద్దరు పిల్లలను, వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని చూసుకొనుటకు చాలా ఇబ్బందిగా ఉన్నదని ఏదైనా ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇప్పించి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని దరఖాస్తు సమర్పించారు.
గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన పోటు నవీన్ తన తండ్రి పేరుతో సర్వే నెంబర్ 236/అ/1 లో ఉన్న 4 ఎకరాల 12 గుంటల భూమిని అన్నదమ్ములము ఇరువురము చెరి సగం పంపకం చేసుకొనగా అట్టి భూమి సీతారామ ప్రాజెక్టు క్రింద తన పేరు మీద ఉన్న భూమి, పోటు రామకృష్ణ పేరు మీద ఉన్న భూమిలో 0.38 గుంటల భూమి ప్రాజెక్టు క్రింద పోతున్నది కానీ తనకు 0.09 గుంటలకు, పోటు రామకృష్ణ కు 0.38 గుంటల భూమికి డబ్బులు వస్తున్నవి కావున సర్వే నెంబర్ లను సరిచేసి సీతారామ ప్రాజెక్టు క్రింద ఎవరి డబ్బులు వారికి వచ్చేటట్లు చేయగలరని దరఖాస్తు చేసుకున్నారు.
నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన రూపిరెడ్డి దిలీప్ రెడ్డి తన భూమిలో గ్రీన్ ఫీల్డ్ హై వే సర్వే చేసి రిపోర్టులో తన భూమిలో ఉన్న బోరు,పైపులైను కు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని అధికారులకు తెలియజేసినప్పటికి ఎలాంటి ఎంక్వైరీ చేయలేదని, విచారణ జరిపి తనకు నష్ట పరిహారం ఇప్పించగలరని కోరారు. ఈ రోజు గ్రీవెన్స్ లో వచ్చిన ( 92 ) దరఖాస్తులను పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’లో డి ఆర్ డి ఎ పి డి సన్యాసయ్య, జెడ్పీ సీఈవో రమాదేవి, జిల్లా అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News