Shubman Gill Prince: టీమ్ఇండియా నూతన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. బీసీసీఐ ఇటీవల నిర్వహించిన ఓ ఫొటోషూట్‌లో గిల్ బ్యాట్ పట్టుకొని ఫోజిచ్చిన చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ బ్యాట్‌పై స్పాన్సర్ ‘MPF’ లోగోతో పాటు ‘ప్రిన్స్’ అనే ట్యాగ్ స్పష్టంగా కనిపించడంతో వివాదం రాజుకుంది.
నెటిజన్లు తీవ్ర అభ్యంతరం :
అభిమానులు శుభ్‌మన్ గిల్‌ను ‘ప్రిన్స్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే, సచిన్ (‘గాడ్’), విరాట్ కోహ్లీ (‘కింగ్’) వంటి దిగ్గజాలు తమ బ్యాట్‌లపై ఇలాంటి ట్యాగ్‌లను ఎప్పుడూ ఉపయోగించలేదు. “వారి కంటే నువ్వేమైనా తోపువా?” అంటూ గిల్ తన బ్యాట్‌పై ‘ప్రిన్స్’ అని రాసుకోవడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
శుభ్‌మన్ గిల్ తనకు తానుగా ‘ప్రిన్స్’ అని అనుకోవడం హాస్యాస్పదమని నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ టెస్టుల్లో సెంచరీ లేకపోవడం, 35 కంటే తక్కువ సగటు, మరియు SENA దేశాలలో పేలవమైన ప్రదర్శన కారణంగా ఆయన ఈ విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ, . ఐదేళ్ల కెరీర్లో ఓవర్సీస్లో ఒక్క సెంచరీ లేదు. టెస్టుల్లో 35 కంటే తక్కువ సగటు. సేనా (SENA) దేశాల్లో పేలవ ప్రదర్శన. ఇలాంటి ట్యాగ్స్ సంపాదించుకోవాలి తప్ప, సెల్ఫ్ డిక్లేర్డ్ చేసుకోకూడదు,” అని తీవ్రంగా విమర్శించారు. “విదేశీ పిచ్‌లపై కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని గిల్ ప్రిన్స్ ఎలా అవుతాడు?” అని మరో నెటిజన్ ప్రశ్నించారు.
37వ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్… భారత టెస్ట్ జట్టుకు 37వ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టీమ్ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది, తొలి టెస్ట్ లీడ్స్‌లో జరగనుంది.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్ :
తొలి టెస్ట్: జూన్ 20, వేదిక: హెడింగ్లీ, లీడ్స్
రెండో టెస్ట్: జూలై 2-6, వేదిక: ఎడ్జ్‌బస్టన్, బర్మింగ్‌హామ్
మూడో టెస్ట్: జూలై 10-14, వేదిక: లార్డ్స్, లండన్
నాలుగో టెస్ట్: జూలై 23-27, వేదిక: ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
ఐదో టెస్ట్: జూలై 31- ఆగస్ట్ 4, వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్