Thursday, June 12, 2025
HomeNewsSNAKE SWALLOWED SHARP KNIFE: అడుగు పొడుగు ఉన్న కత్తిని మింగేసిన పాము

SNAKE SWALLOWED SHARP KNIFE: అడుగు పొడుగు ఉన్న కత్తిని మింగేసిన పాము

SNAKE SWALLOWED SHARP KNIFE: పాములు పాలు తాగుతాయో లేదో తెలీదు గానీ, కత్తులు మాత్రం మింగేస్తాయని ఈ పాము నిరూపించింది. అవును, మీరు చదివింది నిజమే.. ఎలుకలు, గుడ్లు కాదు… ఏకంగా అడుగు పొడవున్న పదునైన కత్తిని మింగేసిన ఓ పాము కథ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని కుంటా తాలూకాలో జరిగిన ఈ సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇది వినడానికి వింతగా నమ్మశక్యంగా లేకున్నా నిజంగా జరిగింది

అసలేం జరిగిందంటే…
హెగ్డే గ్రామానికి చెందిన గోవింద నాయక్ ఇంట్లో వాడుకునే కత్తి గోడపై నుంచి కిందపడింది. సరిగ్గా అదే సమయంలో అక్కడొక నాగుపాము తిరుగుతోంది. పాము వెళ్ళిపోగానే కత్తి తీసుకుందామని కొద్దిసేపు వేచి చూశారు. ఆహారం ఏదో తిని విశ్రాంతి తీసుకుంటుందేమో అనుకున్నారు. కానీ ఎంతసేపటికీ పాము కదలకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానంతో స్నేక్ క్యాచర్ పవన్ నాయక్‌కు సమాచారం అందించారు.

పాము కడుపులో అడుగు పొడుగున్న కత్తి :

ఘటనా స్థలానికి చేరుకున్న పవన్ నాయక్, పామును పరిశీలించి అసలు నిజం తెలుసుకున్నారు. పాము కత్తిని మింగినట్లు నిర్ధారించాడు. కడుపులో పదునైన కత్తి కొన దాని ఛాతి దగ్గర ఇరుక్కుపోవడం వల్లనే కదల్లేకపోతుందని తెలిపారు. కత్తిని బయటకు తీయకపోతే పాము చనిపోతుందని గ్రహించి, స్థానిక వెటర్నరీ హాస్పిటల్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అద్వైత భట్ ఇంటికి తీసుకెళ్లారు. అరగంటకు పైగా శ్రమించిన తర్వాత, ఎట్టకేలకు కోబ్రా కడుపు నుంచి కత్తిని సురక్షితంగా బయటకు తీశారు. పాము కోలుకున్న వెంటనే దాన్ని అడవిలో విడిచిపెట్టారు. ఈ అరుదైన, ఫన్నీ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News