తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. కొత్త ప్రభుత్వం నాలుగు నెలలు గడిచినా ఉద్యోగులకు ఏమి చేయలేదని, హెల్త్ పాలసీ, ఓపిఎస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖలో ఒకే విధానం ఉండాలని, బిల్లులు సక్రమంగా అందడం లేదన్నారు. నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు, మా కన్నా బాగు చేస్తారని మీకు అవకాశం ఇచ్చారని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు.
- Advertisement -
మా ప్రభుత్వానికి కొంత మంది ఉన్నతాధికారులు సహకరించ లేదని, అందుకే బదిలీల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు. పెన్షన్లర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నన్ను ఓడించేందుకే కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయన్నారు శ్రీనివాస్ గౌడ్.