Vivek Athreya: సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం కూలీ సినిమాను చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. రజినీకాంత్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర లాంటి అగ్ర హీరోలు అలరించనున్నారు.
మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ కూలీ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తైన నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. లోకేష్ సినిమా అంటే పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక రజినీకాంత్ కి ఈ మధ్య సాలీడ్ హిట్స్ పడుతున్నాయి. జైలర్, వేట్టయాన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తలైవర్ దుమ్ము దులిపేశారు.
ALSO READ: https://teluguprabha.net/news/nagarjuna-dhanush-multi-starrer-kubera-completes-censor-formalities/
త్వరలో జైలర్ 2 కూడా మొదలవబోతోంది. ఈ క్రమంలోనే రజినీ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్టుగా సమాచారం. అది కూడా టాలీవుడ్ డైరెక్టర్‌తో. అతనెవరో కాదు, యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఈ యంగ్ డైరెక్టర్ తెలుగులో డీసెంట్ సినిమాలను తీసి పాపులర్ అయ్యారు. శ్రీ విష్ణు హీరోగా మెంటల్ మదిలో సినిమాను తీసి టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీకి మంచి రివ్యూస్ వచ్చాయి.
ఆ తర్వాత బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి సినిమాలను రూపొందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు సంపాధించుకున్నాడు. నానీతో తీసిన సరిపోదా శనివారం మంచి యాక్షన్ జోనర్‌లో వచ్చింది. ఫలితం గురించి పక్కన పెడితే, మేకింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తర్వాతే రజినీకి వివేక్ ఆత్రేయ ఓ కథ చెప్పగా అది ఆయనకి బాగా నచ్చింది. అయితే మూడేళ్ల వరకు తాను బిజీగా ఉన్నానని, తర్వాతే సినిమా చేయటానికి కుదురుతుందని అన్నారట. జైలర్2 తర్వాత రజినీకాంత్ ఏ సినిమా చేస్తాడో ఇప్పుడైతే చెప్పలేం కానీ.. వివేక్ ఆత్రేయ సినిమా మాత్రం చేయడనేది స్పష్టమైంది. మరి అప్పటి వరకు వివేక్ ఆత్రేయ వెయిట్ చేస్తాడా? అనేది కశ్చన్ మార్క్‌గా మారింది. రజినీకాంత్ చెప్పాడని మూడేళ్లు వెయిట్ చేస్తే..అప్పటి లెక్కలు ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పలేం. అప్పటి వరకు ప్రాజెక్ట్ హోల్డ్ అవుతుందా? అనేది చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయను తలైవర్ హోల్డ్‌లో పెట్టారనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.