Solar eclipse 2025 effect on Animals: మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఈసారి ఏర్పడబోయేది పాక్షిక సూర్యగ్రహణం. ఇది మన దేశంలో కనిపించదు. అందుకే సూతక కాలం కూడా చెల్లదు. ఇది దక్షిణ అర్ధగోళంలో ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రదేశాలలో కనిపిస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడిని 85% మాత్రమే చంద్రుడు కప్పివేస్తాడు. ఈ టైంలో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా చీకటి ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం, సూర్యగ్రహణం ఆదివారం రాత్రి 10.59 గంటలకు ప్రారంభమై.. తెల్లవారుజామున 1.11 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుని 3.23 గంటలకు ముగుస్తుంది. గ్రహణ సమయంలో జంతువుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసుకుందాం.
సూర్యగ్రహణం జంతువుల ప్రవర్తనలో అతిపెద్ద మార్పుకు కారణమవుతాయి. ఇది యానిమల్స్ యెుక్క నిద్ర, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కొన్ని జంతువులు పగటిపూట చేయాల్సిన పనులు రాత్రిపూట…నైట్ చేసే పనులు పగటిపూట చేస్తాయి. ఓ అధ్యయనం ప్రకారం, 17 రకాల జంతువులలో 13 గ్రహణ సమయంలో భిన్నంగా ప్రవర్తిస్తాయి. ఆఫ్రికన్ ఏనుగుతోపాటు కాకాటూ, లాప్వింగ్, టానీ ఫ్రాగ్‌మౌత్ వంటి పక్షులు గమనంలో పెను మార్పులు వచ్చాయి. బబూన్, అమెరికన్ ఫ్లెమింగోలు కదలికల్లో కీలక మార్పులు వచ్చాయి. గొరిల్లా, లోరికీట్స్, జిరాఫీ మరియు కొమోడో డ్రాగన్ వంటి జంతువుల ప్రవర్తనల్లో చాలా మార్పులు వచ్చాయి.
Also Read: Astrology -వృశ్చిక రాశిలో ధనశక్తి రాజయోగం.. త్వరలో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్..
గ్రహణ కాలంలో కాకులు, పిచ్చుకలు వంటి కదలికలు అరిచే పక్షులు చెట్లపైకి దిగి నిశ్శబ్దంగా ఉండటం కనిపిస్తుంది. కుక్కలు కుంగిపోయి భయంకరమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. తేనెటీగలు తమ గూటికి చేరుతాయి. గుర్రాలు గుంపులుగా ఉండి తలలు మరియు తోకలను ఊపిస్తాయి. దీనిని “ఫోటో హెడ్ షేకింగ్” అని పిలుస్తారు. సాలెపురుగులు తమ వలలను విచ్ఛిన్నం చేస్తాయి. జింబాబ్వేలోని హిప్పోలు నదులను విడిచిపెట్టి తమ రాత్రిపూట తినే ప్రదేశాల వైపు వెళుతున్నట్లు కనిపించాయి. మే 30, 1984న సంభవించిన గ్రహణం సమయంలో చింపాంజీలు ఎత్తైన ప్రదేశంలోకి వెళ్లాయి.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పండితుల సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ కథనాన్ని రూపొందించాం. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగు ప్రభ ఈ వార్తను ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.


