Saturday, November 23, 2024
HomeNewsTelangana Chatrapathi: తెలంగాణ ఛత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

Telangana Chatrapathi: తెలంగాణ ఛత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు మంత్రి గంగుల. 313వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి గంగుల కమలాకర్, గోల్కొండ కోటపై జెండా ఎగరెసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆ మహనీయుని ఆశయ సాధనలో ఆశయ సాధకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ గంగుల పేర్కొన్నారు.

- Advertisement -

నేడు కరీంనగర్ లో సర్వాయి పాపన్న 313 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆయన పౌరుషాన్ని ప్రతఒక్కరు ఆదర్శంగా తీసుకోని రాజ్యాధికారమె లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.

300 సంవత్సరాలకంటే ముందే బహుజన రాజ్యం కోరకు గోల్కోండ కోటను అధిరోహించి గోల్కోండ సింహాసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. సర్దార్ పాపన్న ఒక గౌడకులానికే కాకుండా బిసి సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నరని గుర్తు చేశారు

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జడ్పి చైర్మన్ కనమల్ల విజయ,సుడా చైర్మన్ జీవి రామ క్రిష్ణ రావు,గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, భారాసా అధ్యక్షులు చల్ల హరిశంకర్ , మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం నాయకులు గణగాని సత్యనారాయణ గౌడ్(కలర్ సతన్న), సింగం సతయ్య గౌడ్, కట్ట సత్తయ్య గౌడ్, గౌడ శంఖారావం పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ గౌడ్, తరుణ్ గౌడ్ ,కార్పొరేటర్ లు కోటగిరి భూమగౌడ్ , ,గుగ్గిళ్ళ జయశ్రీ -శ్రీనివాస్ ఐలందర్ యాదవ్,ముత్యం శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News