Monday, May 19, 2025
HomeNewsTandur Congress politics: శరవేగంగా మారుతున్న తాండూర్ కాంగ్రెస్ పాలిటిక్స్

Tandur Congress politics: శరవేగంగా మారుతున్న తాండూర్ కాంగ్రెస్ పాలిటిక్స్

కాంగ్రెస్ గెలిచే ఛాన్స్, మరిక్కడి రేసు గుర్రం ఎవరో?

వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు ఎమ్మెల్యే అభ్యర్థుల హడావుడి జోరుగా కొనసాగుతోంది. ఇదివరకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ నాకే కన్ఫర్మ్ అంటూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్ కొన్ని సమావేశాల్లో తెలిపిన విషయం తెలిసిందే. అంతలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లాక్ష్మారెడ్డి (కే.ఎల్.ఆర్) కి టికెట్ కన్ఫర్మ్ అని తాండూరు కాంగ్రెస్ నేతలు కూడా చెపుకొస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ప్రముఖ వ్యాపారవేత్తలైన బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన డా. సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డిలు తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బరిలోకి దిగడంతో తాండూరు కాంగ్రెస్ లో కొత్త మలుపు తిరిగిందనక తప్పదు. కొన్ని సర్వేల ఆధారంగా, తాండూరు కాంగ్రెస్ నేతలు, తాండూరు ప్రజలు నోట తాండూరు కాంగ్రెస్ టికెట్ డా. సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డిలకు టికెట్ వస్తేనే తాండూరులో మార్పువస్తుందని వినిపిస్తుంది. గత ఎన్నికల్లో తాండూరు టికెట్ రమేష్ మహరాజ్ కి వచ్చిన టికెట్ పైలెట్ రోహిత్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పడు కుడా రమేష్ మహరాజ్ కి కన్ఫర్మ్ అన్న మాటలు జోరుగా వినిపిస్తుండగా, తాజాగా తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్ అని మీడియా సమావేశాల్లో ఊదరగొడుతున్నారు. మొత్తానికి తాండూరు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వర్గవిభేదాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు రమేష్ మహరాజ్, కే.ఎల్.ఆర్ మరోవైపు సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి.. మరింతకీ అధిష్టానం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతోందనేది చర్చనీయాంశంగా మారింది. వీరు కాకుండా ఎన్నికల సమయంలో మరోనేత దర్శనం ఇచ్చే అవకాశం ఉందా? చివరికి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో వేచిచూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News