Saturday, November 15, 2025
HomeNewsIsrael: బాడీగార్డ్ నిర్లక్ష్యం వల్ల ఇరాన్ కు ఎదురుదెబ్బ..!

Israel: బాడీగార్డ్ నిర్లక్ష్యం వల్ల ఇరాన్ కు ఎదురుదెబ్బ..!

Israel: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమవుతోంది. ఇరాన్ పై జూన్‌ 13న ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అయితే, ఈ దాడుల్లో ఇరాన్‌ (Iran) ఐఆర్‌జీసీ చీఫ్‌ సలామీ, ఆర్మీ చీఫ్‌ బాఘేరీ, మిసైల్స్‌ చీఫ్‌ అమీర్‌ అలీ హజిజాదేలను ఇజ్రాయెల్‌ (Israel) మట్టుపెట్టింది. కాగా.. దీనికి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి స్మార్ట్‌ ఫోన్లను ఇజ్రాయెల్‌ ట్రాక్‌ చేస్తుండటంతో.. వాటితో ముప్పు ఉంటుందని ఇరాన్‌ నాయకత్వానికి తెలుసు. ఈ క్రమంలో రాజకీయ, సైనిక నాయకత్వం వాటిని వాడటం మానేసింది. కానీ, వారి బాడీగార్డులు ఫోన్లను వాడేవారు. సోషల్‌ మీడియాలో పోస్టులు చేసేవారు. దీంతో వారిని ఇజ్రాయెల్‌ (Israel) ట్రాక్‌ చేసింది. యుద్ధం ముందు వరకు వారి కదలికలను గుర్తించింది. జూన్‌ 13 దాడుల తర్వాత బాడీ గార్డులను కూడా ఫోన్లు వాడొద్దని.. కేవలం వాకీ టాకీలనే వినియోగించాలని ఇరాన్‌ (Iran) ఆదేశించింది.

- Advertisement -

 Read Also: Google: సైబర్ దాడులు.. 25 లక్షల వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక

బాడీ గార్డ్ నిర్లక్ష్యం వల్ల

కానీ, జూన్‌ 16న జరిగిన కీలక సమావేశ సమయంలో ఓ బాడీగార్డ్‌ ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అదో పెద్ద అవకాశంలా లభించింది. ఆ సంకేతాల ఆధారంగా 100 అడుగుల లోతులోని బంకర్‌పై దాడి చేసింది. వాస్తవానికి ఆ  రహస్య ప్రదేశంలో ఇరాన్‌ (Iran) సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ మీటింగ్‌ జరుగుతోంది. దానిలో అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, న్యాయవిభాగం, ఇంటెలిజెన్స్‌ అధిపతులు కూడా ఉన్నారు. వీరంతా వేర్వేరు కార్లలో అక్కడికి చేరుకొన్నారు. ఎవరూ ఫోన్లు తీసుకురాలేదు. కానీ, ఓ బాడీగార్డ్‌ నిర్లక్ష్యాన్ని ఇజ్రాయెల్‌ వాడుకొని దాడి చేసింది. ఈ దాడిలో పెజెష్కియాన్‌ కాలికి తీవ్రగాయమైంది. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడినా.. గార్డులు మాత్రం మరణించారు.
Read Also: IIT Guwahati: పది సెకన్లలోనే కాలుష్య కారకాలను గుర్తించొచ్చా?
అణుశాస్త్రవేత్తల జాబితా సిద్ధం చేసి..
ఈ 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌ (Israel) డజన్లకొద్దీ సైనిక కమాండర్లను మట్టుపెట్టగా.. మరో డజను మంది వరకు అణుశాస్త్రవేత్తలను హతమార్చింది.  1980 ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధం తర్వాత ఈ స్థాయి ఎదురుదెబ్బ టెహ్రాన్‌కు ఎప్పుడూ తగల్లేదు. ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌ (Israel) కోసం గూఢచర్యం చేస్తున్నవారిని ఇరాన్‌  (Iran) అరెస్టు చేసింది. వారిలో అణుశాస్త్రవేత్త రుజ్‌బెహ్‌ వాది కూడా ఉండటం విశేషం. అతడిని ఆగస్టులో ఉరితీసింది. యుద్ధ సమయంలో మొస్సాద్‌ కోసం గూఢచర్యం చేసిన మరో 8 మందిని అరెస్టు చేసినట్లు తాజాగా టెహ్రాన్‌ ప్రకటించింది. కానీ, అప్పటికే ఇరాన్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకపోతే, 2022 నుంచి ఇరాన్‌ (Iran) అణుశాస్త్రవేత్తలను ట్రాక్‌ చేయడం మొదలుపెట్టింది. గతేడాది అక్టోబర్‌ నాటికే వారిని చంపాలని చూసినా.. బైడెన్‌ కార్యవర్గంతో అభిప్రాయభేదాల వల్ల ఆగింది. గతేడాది చివరి నుంచి జూన్‌ వరకు ఇజ్రాయెల్‌లోని ఓ బృందం.. ఇరాన్‌ అణుకార్యక్రమంలోని శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను రివ్యూ చేసింది. 2018లో ఇరాన్‌ నుంచి అపహరించిన అణుకార్యక్రమ వివరాల్లో వారి పేర్లు ఉన్నాయి. మొత్తం 400 మందిని చంపేందుకు షార్ట్‌లిస్ట్‌ చేయగా.. చివరికి దానిని 100 మందికి కుదించింది. చివరికి 13 మందిని చంపింది. అదే సమయంలో ‘ఆపరేషన్‌ రెడ్‌ వెడ్డింగ్‌’ పేరిట ఇరాన్‌ సైనిక నాయకత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad