తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఆహ్వానిస్తున్నట్టు రవాణా-బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను 9 వ తేదిన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించడానికి వారి సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నట్టు మంత్రి పొన్నం వివరించారు.
వాళ్ళు సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం ఇస్తామని, వారు ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నట్టు పొన్నం మీడియాకు వెల్లడించారు.