దేవుడా…. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తుగ్గలి శ్రీనివాసరెడ్డి దేవుడిని ప్రార్థించారు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ అసత్యపు ప్రచారం చేసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైయస్సార్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయాల్లో పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వైయస్సార్సీపి సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తుగ్గలిలో ఉన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతులను, లడ్డు ప్రసాదం పవిత్రతను చంద్రబాబు నాయుడు అపవిత్రం చేశారని రాజకీయా దుర్బుద్ధితో, అబద్ధాలు పలికారన్నారు. తిరుమలలో అనేకసార్లు పట్టు వస్త్రాల సమర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు డిక్లరేషన్ అడిగి రాజకీయం చేస్తూ దర్శనాన్ని అడ్డుపడటం తప్పు అని, భక్తులు మనోభావాలతో రాజకీయం చేయడం చాలా బాధాకరమన్నారు. భగవంతుడు ఇలాంటి నీచ రాజకీయాలు చేసే వారిని ఆ దేవుడు క్షమించడని వారన్నారు.
అంతకముందు దివంగత నేత, మాజీ సిఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి చెన్నకేశవస్వామి గుడి ఆలయంలో పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర నాగప్ప, వైస్ఎంపీపీ, మల్లికార్జునరెడ్డి, తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి,శభాష్ పురం హనుమంతు, జడ్పిటిసి పులికొండనాయక్,ఎర్రగుడి రామచంద్రారెడ్డి, రాంపల్లి నాగభూషణం రెడ్డి,భూషణ్ రెడ్డి,హుస్సేన్, రాతన,మోహన్ రెడ్డి,జొన్నగిరిగుంతరఘు, మారెళ్ళవిష్ణు,గిరిగెట్ల విష్ణువర్ధన్ రెడ్డి, రామ్ కొండ పాటిల్ సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అట్లా గోపాల్ రెడ్డి,అట్లాబసిరెడ్డి, కో ఆప్షన్ నెంబర్ చాంద్ బాషా,మైనార్టీ నాయకుడు టిఎండి హుస్సేన్, ఉప్పర్లపల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,ఉపసర్పంచ్ రామాంజనేయులు, భీమా నాయక్ రాంపురం సర్పంచ్ కమల్ భాష,చెన్నంపల్లి రంజాన్, రామలింగాపల్లి నాగిరెడ్డి,వెంకట్ రాముడు, రాఘవరెడ్డి బొందిమడుగుల ఈశ్వర్ రెడ్డి, లింగనేని దొడ్డి గిడ్డయ్య గిరిగెట్ల ఫణి భూషణ్ రెడ్డి,రాంపురంబద్రి,ముక్కెళ్ల గిడ్డయ్య,గోవర్ధన్ రెడ్డి రాంపురం గోవిందరాజులు మామిళ్ళకుంట సత్యప్ప ఆంజనేయులు,తుగ్గలి మాజీ సర్పంచ్ పురుషోత్తం, దేవరాజు, భంగి రాముడు తదితరులు పాల్గొన్నారు.