Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్US-Israel Bloc : ఇరాన్ పై అణు దాడికి ట్రంప్ 80 నిమిషాల ప్రణాళిక

US-Israel Bloc : ఇరాన్ పై అణు దాడికి ట్రంప్ 80 నిమిషాల ప్రణాళిక

Iran Israel War Trump : ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ తీవ్రమవుతోంది. అమెరికా యుద్ధంలోకి దిగేందుకు సిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయాలని ట్రంప్ యోచిస్తున్నారట. ఈ విషయంపై ఆయన తన భద్రతా బృందంతో 80 నిమిషాల రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా అమెరికా కూడా ఇరాన్ అణు కేంద్రాలపై నేరుగా దాడి చేయాలా అనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భ యురేనియం కేంద్రం ప్రధాన లక్ష్యంగా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అమెరికా ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ దాడులతో తమకు సంబంధం లేదని చెబుతుండటం విశేషం.

అమెరికాను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్‌కు కష్టమే : ఇక ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్ అకౌంట్లో వరుసగా చేస్తున్న పోస్ట్‌లు అమెరికా యుద్ధనీతిలో సునిశిత మార్పుల సంకేతంగా భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా తమ దేశంపై ఎలాంటి దాడికి పాల్పడినా, తగిన జవాబు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే అమెరికాను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్‌కు కష్టమే. దాదాపు 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న క్షిపణులు ఆ దేశం వద్ద లేవు.

మొత్తం మధ్యప్రాచ్యాన్ని యుద్ధంలోకి లాగించే ప్రమాదం : ఈ నేపథ్యంలో హూతీలు, సిరియా ఇరాక్‌ ముఠాలు, ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికా మిలటరీ స్థావరాలు మొదటి దాడులకు గమ్యస్థానాలయ్యే అవకాశముంది. పశ్చిమాసియాలోని ఖతార్, బహ్రెయిన్, యూఏఈ వంటి దేశాల్లో అమెరికా సైనికులు ఉన్న స్థావరాలపై దాడులు జరిగితే, చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశానికెగరడం ఖాయంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఈసారి వ్యవహారం ఒక దేశం కాదు మొత్తం మధ్యప్రాచ్యాన్ని యుద్ధంలోకి లాగించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad