Saturday, January 18, 2025
HomeTS జిల్లా వార్తలుమహబూబ్ నగర్Vanaparthi: ప్రభుత్వాసుపత్రికి దొంగల ఫీవర్

Vanaparthi: ప్రభుత్వాసుపత్రికి దొంగల ఫీవర్

ఆసుపత్రిలో దొంగలు పడ్డారు

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులు, వారి సహాయకుల భద్రత డొల్లగా మారింది. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వందల సంఖ్యలో రోగులు వస్తుండగా వీరిలో ఎవరు రోగులో, ఎవరు దొంగలో గుర్తించలేనంత గందరగోళంగా పరిస్థితి తయారైంది.

- Advertisement -

ఇక్కడ ఎప్పుడూ ఏదో తలనొప్పి

వనపర్తి జిల్లా దవాఖానలో తరచూ ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటునే ఉంది. శుక్రవారం ఉదయం ఐదు గంటల సమయంలో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న ఒక రోగి సెల్ ఫోన్ చోరీ చేసిన దొంగ ఇంకొంతమంది రోగులను లూటీ చేసేందుకు దర్జాగా సర్జికల్ వార్డులో తిరిగాడు. ఇతని వాలకం చూసి, అనుమానం వచ్చిన పేషెంట్లు అతన్ని నిలదీస్తే పేషెంట్లను కలవడానికి వచ్చినట్టు దబాయించాడు. అయినా అనుమానంతో పేషెంట్లు గట్టిగా అడగ్గా, సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో ఇతను దొంగై ఉంటాడని వాటర్ బాటిళ్లతో కొట్టి, బయటకు గెంటేశారు. ప్రభుత్వ ఆస్పత్రులలో తరచుగా ఇలాంటి సంఘటనలో చోటు చేసుకుంటుండడంతో పేద రోగులు గవర్నమెంట్ హాస్పిటల్స్ రావడానికి జంకే పరిస్థితులు నెలకొన్నాయి.

అవుట్ పోస్టింగ్ లేకపోవడమే లోపంమా?

ప్రభుత్వ ఆస్పత్రులలో పోలీస్ అవుట్ పోస్టింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల నిత్యం చోరీలు జరుగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అవుట్ పోస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ధ్యాస వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు చెవికి ఎక్కడం లేదని పలువురు పట్టణ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోగం నయం చేసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులకు దొంగల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే కొంతమంది సెక్యూర్టీ సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా రోగులు వారి సహాయకుల భద్రత గురించి ఆస్పత్రి పర్యవేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు జోరుగా వినబడుతున్నాయి. తరచుగా చేసుకుంటున్న దొంగతనాల సంఘటనలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగుల భద్రత గాలిలో దీపంగా మారింది. రోగులు, వారి సహాయకులకు చెందిన సెల్ ఫోన్లు, పర్సులు, ఆభరణాలు, నగదు ఇలా అనేక రకాలుగా వారి వద్ద ఉండే వస్తువులను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. మధ్యరాత్రిలో నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో లూటీలు కానిచ్చేస్తున్నారు.

సీసీ కెమెరాలు ఉన్నట్ల లేనట్టా?

ప్రభుత్వ ఆస్పత్రులలో ఏదైనా సంఘటన జరిగిన సమయంలో హడావుడి చేసే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అనంతరం వాటి గురించి పట్టించుకోవడం లేదు. గతంలో ఏరియా హాస్పిటల్ గా ఉన్న ప్రస్తుత జనరల్ హాస్పిటల్ లో గతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో కొన్ని మాత్రమే పనిచేస్తున్నట్టు తేలింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడంతో ఒక అగంతకుడు ఏకంగా డాక్టర్ రెస్టు రూమ్ లోకి చొరబడి డాక్టర్ పర్సు ఎత్తుకెళ్లాడు. మరొక సంఘటనలో నిద్రిస్తున్న రోగి సహాయకురాలి మెడలో రెండు తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. హాస్పిటల్లో ఫ్యాన్లు, కంప్యూటర్ సిపియులు ఎత్తుకెళ్లిన సంఘటనలు కూడా గతంలో చోటుచేసుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News