Vijay Antony: ఓటీటీల ఎఫెక్ట్ థియేటర్లపై గట్టిగానే పడుతోంది. ప్రస్తుతం ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రావడం కామన్‌గా మారింది. ఫ్లాపయితే పట్టుమని పది రోజులు కూడా గ్యాప్ ఇవ్వడం లేదు… తాజాగా కోలీవుడ్ హీరో బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మార్గన్ (Maargan) థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. జూలై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఓటీటీలో మార్గన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు భాషల్లో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
యావరేజ్…
మార్గన్ మూవీకి లియో జాన్ పాల్ (Leo John Paul) దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిషాన్ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించే పాజిటివ్ రోల్ చేశాడు. జూన్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు ఈ మూవీ విడుదలైంది. తమిళంలో యావరేజ్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మాత్రం రిలీజైన విషయమే తెలియకుండా వెళ్లిపోయింది. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మెట్‌లో కథ సాగడం, ట్విస్ట్‌లు ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోవడం…మార్గన్‌కు మైనస్‌గా మారింది. మార్గన్ మూవీలో సముద్రఖని, బ్రిగాడా సాగ, ప్రీతిక ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read – CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఎవరెవరిని కలవనున్నారంటే?
డీజీపీ అన్వేషణ…
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో అనూహ్య రీతిలో అమ్మాయిలు హత్యలకు గురవుతుంటారు. వారి డెడ్‌బాడీలు నలుపురంగులోకి మారిపోతుంటాయి. ఈ కేసును ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను అడీషనల్ డీజీపీ ధృవ కుమార్ చేపడతాడు. ఈ సీరియల్ కిల్లర్ వల్ల ధృవకుమార్ కుటుంబానికి కూడా అన్యాయం జరుగుతుంది. ధృవ ఇన్వేస్టిగేషన్‌లో అరవింద్ అనే యువకుడు ఈ హత్యలు చేసినట్లుగా ఆధారాలు దొరుకుతాయి. విచారణలో అరవింద్ ద్వారా ధృవకుమార్‌కు కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. అవేమిటి? అరవింద్ నిజంగానే సీరియల్ కిల్లరా? ధృవకుమార్ కూతురు ఏమైంది? అన్నదే ఈ మూవీ కథ.
శక్తి తిరుమగన్…
రిజల్ట్‌తో సంబంధం లేకుండా హీరోగా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ. 2024 లో రోమియో, తుఫాన్‌తో పాటు హిట్లర్ సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు విజయ్ ఆంటోనీకి నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాది మార్గన్ తర్వాత శక్తి తిరుమగన్ పేరుతో పొలిటికల్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ ఆంటోనీ. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Also Read – Tollywood: హిట్టు కోసం టాలీవుడ్ హీరోల వెయిటింగ్ – ఈ సారైనా గట్టెక్కుతారా?


