Friday, November 22, 2024
HomeNewsWhat is skill development scam?: ఏమిటీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం?

What is skill development scam?: ఏమిటీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం?

హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు, రిమాండ్‌ రిపోర్టులో అన్నీ ఉన్నాయి

 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం టీడీపీ మెడకు చిక్కుకుందన్న నేపథ్యంలో అసలు ఏమిటీ కుంభకోణం? చంద్రబాబు ఇందులో ఎలా చిక్కుకున్నారు? బాబు అరెస్టు సబబేనా? అసలు కుంభకోణం నిజంగా జరిగిందా? జరిగితే ఇందులో మాజీ సీఎం బాబు పాత్ర ఎంత? అప్పటి మంత్రి గంటా శ్రీనివాస రావు ఇందులో ఏమిట? గంటా కుమారుడిని ఏపీ సీఐడీ ఎందుకు అరెస్టు చేసింది? అసలు బాబు, గంటా, గంటా కుమారుడు పోషించిన పాత్రలేంటి? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మన తెలుగువారిని ఆలోచింపచేస్తున్నాయి. బహుశా రాష్ట్ర రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసే అంశంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్క్యామేనా అన్న అనుమానాలు రాజకీయ పండితులకు వస్తున్న నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్క్యాం లోతుపాతులు, పూర్వాపరాలపై తెలుగుప్రభ అందిస్తున్న వివరాలు..

- Advertisement -

చంద్రబాబు నాయుడు హయాంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు గంటా శ్రీనివాస రావు. చంద్రబాబుతో కలిసి ఏపీఎస్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేసినట్లు గంటాపై గతంలోనే చాలా ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా దీనిని ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తున్నది.

టీడీపీ హయాంలో 2016-2019లో బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా 118 కోట్ల ప్రభుత్వ మొత్తం వివిధ స్థాయిల్లో చేతులు మారిందనేది ప్రధాన ఆరోపణ. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ద్వారా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ సబ్‌ కాంట్రాక్టర్‌గా ఈ డబ్బు కాజేసినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. ఓప్రధాన పత్రికలో వచ్చిన ఈ వార్తలపై రంగంలోకి దిగిన ఐటీ అధికారులు చంద్రబాబు, ఆయన పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్‌, మనోజ్‌ వాసుదేవ్‌, యోగేశ్‌ గుప్తాకు నోటీసులు అందజేశారు. ఇప్పటికే వారి ఇళ్లపై దాడులు జరిగి, సోదాలు చేశారు. ఈ క్రమంలో బోగస్‌ కాంట్రాక్టులు, వర్క్‌ ఆర్డర్‌ ద్వారా ముడుపులు చేతులు మారినట్లు మనోజ్‌ వాసుదేవ్‌ అంగీకరించినట్లు ఐటీ శాఖ చెప్పటం విశేషం. ఆ మూడేళ్ల కాలంలో ఎన్ని కాంట్రాక్టులను సదరు సంస్థకు దక్కాయి? చేతులు మారిన విధానం ఏంటి? వంటివి ఇక్కడ ప్రధాన అంశాలుగా మారాయి. చంద్రబాబు అనుచరులైన మనోజ్‌, శ్రీనివాస్‌ విదేశాలకు పారిపోగా.. ఐటీ నోటీసుల ను సాకుగా చూపి ఏపీ సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది.

కాగా చంద్రబాబు, గంటా అరెస్టుతో హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు స్పష్టం చేశారు. రిమాండ్‌ రిపోర్టులో అన్నీ ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News