Sunday, July 7, 2024
HomeNewsబాక్స్ ఆఫీస్ వద్ద ఆదిపురుష్ కలెక్షన్ల సునామి సృష్టిస్తుందా..?

బాక్స్ ఆఫీస్ వద్ద ఆదిపురుష్ కలెక్షన్ల సునామి సృష్టిస్తుందా..?

- Advertisement -

యావత్ సినీ లోకం తో పాటు రామ భక్తులు ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మూవీ.. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడి గా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తోన్న ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు పాటు టికెట్ రేట్స్ పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వగా..తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఆదిపురుష్ టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. మరో పక్క దేశ వ్యాప్తంగా కూడా ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉండడం తో బాక్స్ ఆఫీస్ వద్ద ఆదిపురుష్ కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయమని అంత భావిస్తున్నారు.

దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా.. అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరు చూపించింది. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవ్వడం..కొంతసేపు వరకు సర్వర్ క్రాష్ అవ్వడం చూస్తే సినిమాను చూసేందుకు అభిమానులు, సినీ లవర్స్ ఎంత అతృతతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాకు మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండొచ్చనే చర్చ సోషల్ మీడియా లో జోరుగా నడుస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగడం, పీవీఆర్ సంస్థ ఏకంగా లక్ష టికెట్లు అమ్మడంతో ఆదిపురుష్ డే-1 వసూళ్లపై అందరికీ ఆసక్తి నెలకొంది.

సినీ విశ్లేషకుల విశ్లేషణ ప్రకారం.. మొదటి రోజే ఈ సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హిందీ వెర్షన్ కు తొలి రోజు 30 కోట్ల రూపాయల నెట్ వసూళ్లూ వచ్చే అవకాశం ఉందని , ఇక సౌత్ లో (తెలుగు రాష్ట్రాలతో కలుపుకొని) ఈ సినిమాకు మొదటి రోజు కచ్చితంగా 80 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్రెడీ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే ఫస్ట్ డే యూఎస్ లోను భారీ వసూళ్లు రాబట్టి రికార్డు బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు. సినిమా టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా నార్త్ లో పఠాన్, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News