Hari Hara Veeramallu – The Rajasaab: సెంటిమెంట్ వర్కవుట్ కావాలని దేవుళ్లకు నిధి అగర్వాల్ దండం పెట్టుకుంటుంది. గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ చానాళ్లుగా సక్సెస్ కొట్టటానికి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి కాదు.. ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయటానికి రెడీ అయ్యింది. ఈ ఏడాదిలోనే ఆ రెండు సినిమాలు రిలీజ్ కానుండటం విశేషం. అయితే ఈ రెండు సినిమాలు సక్సెస్ కావటం పక్కా అని నిధి భావిస్తోందట. అందుకు ఓ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని బలంగా నమ్ముతుందట.
2018లో విడుదలైన సవ్యసాచి చిత్రంలో నాగచైతన్యతో జోడీ కట్టి అందరినీ ఆకట్టుకున్న బ్యూటీ నిధి అగర్వాల్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. తర్వాత మరుసటి ఏడాది అఖిల్ అక్కినేని సరసన కూడా మిస్టర్ మజ్నులో నటించింది. అది కూడా బోల్తా పడింది. అయితే అదే ఏడాది ద్వితీయార్థంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాయే నిధికి తొలి సక్సెస్‌ను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడే రెండేళ్లు గడిపేసింది.
ALSO READ: https://teluguprabha.net/category/cinema-news/#google_vignette
2022లో గల్లా అశోక్ కథానాయకుడిగా రూపొందిన హీరో మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సో సోగానే ఆడింది. అయితే తర్వాత ఏకంగా రెండు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటించటానికి సైన్ చేసింది. ఆ సినిమాలే హరిహర వీరమల్లు, ది రాజా సాబ్. ఒకదాంట్లో పవన్ కళ్యాణ్ హీరో కాగా, మరో దాంట్లో ప్రభాస్ హీరో. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావటం.. అంచనాలు ఎక్కువగా ఉండటంతో మేకింగ్‌కి సమయం పట్టాయి. అయితే రెండు సినిమాలు ఓకే ఏడాదిలో, ఎక్కువ గ్యాప్ లేకుండా వస్తుండటం కొసమెరుపు
హరిహర వీరమల్లు, ది రాజా సాబ్.. చిత్రాలు రెండు ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కావటంపై నిధి సంతోషంగా ఉంది. అందుకు కారణం.. సక్సెస్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని. ఇంతకీ ఏంటా సక్సెస్ సెంటిమెంట్ అంటే.. ఇస్మార్ట్ శంకర్ 2019 ద్వితీయార్థంలోనే విడుదలైంది. ఇప్పుడు హరిహర వీరమల్లు, రాజా సాబ్ చిత్రాలు రెండు ద్వితీయార్థంలోనే రానున్నాయి. కాబట్టే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అమ్మడు భావిస్తోందట.
ఇద్దరు బిగ్ స్టార్స్‌తో నిధి అగర్వాల్ నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే ఏడాదిలో 6 నెలల కంటే తక్కువ గ్యాప్‌లో రానుండటం నిజంగానే నిధికి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమా పీరియాడిక్ మూవీగా తెరకెక్కితే, రాజా సాబ్ .. హారర్ ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. రెండు డిఫరెంట్ జోనర్ సినిమాల కోసం నిధి అగర్వాల సమయం ఎక్కువగానే కేటాయించినప్పటికీ ఆమెకు హిట్ పడితే చాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నేరవేరుతుందేమో చూద్దాం మరి.