Xiaomi Pad Mini: చైనీస్ టెక్ దిగ్గజం మరొక కాంపాక్ట్ టాబ్లెట్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. షావోమి తన కొత్త కాంపాక్ట్ టాబ్లెట్ షావోమి ప్యాడ్ మినీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. కంపెనీ దీని మాత్రమే కాకుండా, రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో, షియోమి 15T, షియోమి 15T ప్రో లను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త టాబ్లెట్ 8.8-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డిమెన్సిటీ చిప్‌సెట్ ను అమర్చారు. 7500mAh బిగ్ బ్యాటరీతో వస్తోన్న ఈ టాబ్లెట్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లు, రెండు రంగులలో లభిస్తోంది. దీని ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
షావోమి ప్యాడ్ మినీ: ధర
షావోమి ప్యాడ్ మినీ 8GBRAM+256GB నిల్వ కలిగిన బేస్ మోడల్ ధర $429 (సుమారు రూ. 37,000) నుండి ప్రారంభమవుతుంది. అయితే, కంపెనీ 12GB RAM+ 512GB నిల్వతో ఈ కొత్త టాబ్లెట్‌ను కూడా అందిస్తుంది. కాకపోతే, టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. టాబ్లెట్ పర్పుల్, గ్రే రంగులలో లభిస్తోంది. వినియోగదారులు టాబ్లెట్‌తో పాటుషావోమి ఫోకస్ పెన్ లేదా రెడ్‌మి స్మార్ట్ పెన్ స్టైలస్, షావోమి ప్యాడ్ మినీ కవర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.
షావోమి ప్యాడ్ మినీ: ఫీచర్లు
షావోమి ప్యాడ్ మినీ టాబ్లెట్ 8.8-అంగుళాల 3K (3008×1880 పిక్సెల్స్) డిస్‌ప్లేను 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 403 ppi పిక్సెల్ డెన్సిటీ, 16:10 యాస్పెక్ట్ రేషియో, డాల్బీ విజన్ సపోర్ట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ టాబ్లెట్ డిస్‌ప్లే TÜV రీన్‌ల్యాండ్ నుండి తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సిర్కాడియన్-ఫ్రెండ్లీ సర్టిఫికేషన్‌లను పొందిందని కంపెనీ చెబుతోంది.
also read:Flipkart Big Billion Days: ఐఫోన్ 16 పై రూ.27వేల భారీ తగ్గింపు.. కొనడానికి ఇదే మంచి ఛాన్స్..
పనితీరుకోసం కంపెనీ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ ను అమర్చింది. ఇది 12GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. షావోమి ప్యాడ్ మినీ హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నడుస్తుంది. ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న ఏఐ సాధనాల్లో ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నిషన్, ఏఐ ఇంటర్‌ప్రెటర్, ఏఐ ఆర్ట్, ఏఐ కాలిక్యులేటర్, గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్ ఉన్నాయి.
ఫోటోగ్రఫీ కోసం, ఇది 13-మెగాపిక్సెల్ 1/3.06-అంగుళాల సెన్సార్, f/2.2 ఎపర్చర్‌తో సింగిల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 30fps వద్ద 4K వీడియోను, 30fps వద్ద 1080p వీడియోను రికార్డ్ చేయగలదు. ఇక ముందు భాగంలో టాబ్లెట్ 1/4-అంగుళాల సెన్సార్, f/2.28 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. షావోమి ప్యాడ్ మినీ హై-రెస్ ఆడియో, డాల్బీ అట్మోస్ మద్దతుతో డ్యూయల్-స్టీరియో సెటప్‌ను కలిగి ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే, షావోమి ప్యాడ్ మినీ 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 18W వరకు వైర్డు రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7500mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. ఇది Wi-Fi 7, బ్లూటూత్ 5.4 లకు కూడా మద్దతు ఇస్తుంది. దీని కొలతలు 205.13×132.03×6.46mm. దీని బరువు దాదాపు 326 గ్రాములు.


