Thursday, September 12, 2024
Homeపాలిటిక్స్రుణమాఫీపైన రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రుణమాఫీపైన రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రుణమాఫీ పేరిట సీఎం రేవంత్‌ రెడ్డి మోసానికి తెరలేపారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ మొత్తం బోగస్‌ అని.. మిలియన్‌ డాలర్ల జోక్‌గా తేలిపోయిందని విమర్శించారు. అందుకే దాని నుంచి అటెన్షన్‌ డైవర్షన్‌ చేయడానికే ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న ఈ రుణమాఫీ.. స్వతంత్ర భారత దేశంలోనే రైతులకు జరిగిన అతిపెద్ద మోసమని కేటీఆర్‌ మండిపడ్డారు. ఒక దారుణమైన దగా, ఒక మాయ అని అన్నారు. రైతన్నలతో క్రూరమైన పరిహాసం ఆడిందని కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు. అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులు, కూతలు-కోతలతో రైతు రుణమాఫీ ఉందన్నారు. అన్నదాతలను కాంగ్రెస్‌ పార్టీ నిండా ముంచిందని అన్నారు. అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని తెలిపారు.

రెండు లక్షల రుణమాఫీ కోసం 40వేల కోట్లు అవుతుందని రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందు చెప్పారని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఒక సంవత్సరం నేను కడుపుగట్టుకుంటే ఈ డబ్బును అనాయసంగా కట్టేయొచ్చని రేవంత్‌ చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ ఈ లెక్క మారింది.. 31వేల కోట్లతో రుణమాఫీ చేయాలని కేబినెట్‌ తీర్మానించిందని తెలంగాణ సీఎంవో జూలైలో ఒక ట్వీట్‌ చేసిందని తెలిపారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హులే అని ఎన్నికల ముందు చెప్పారని.. ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు.

రుణమాఫీ లెక్కలు చూస్తే.. ఉద్యోగికి రుణమాఫీ కట్‌.. పెన్షనర్‌కు కట్‌.. ఇన్‌కం ట్యాక్స్‌ కట్టేటోళ్లకు కట్‌.. రేషన్‌ కార్డు లేకుంటే కట్‌ చేశారని కేటీఆర్‌ అన్నారు. ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పలేదని అన్నారు. సీఎం అంటే నిజానికి చీఫ్‌ మినిస్టర్‌.. కానీ ఇప్పుడు కటింగ్‌ మాస్టర్‌లా పరిస్థితి అయిపోయిందని ఎద్దేవా చేశారు. 60 శాతం మందికి ఎగ్గొట్టి.. కేవలం 40 శాతం మందికి చేసి.. 100 శాతం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న మొట్ట మొదటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని మండిపడ్డారు. ఇంతకుమించిన దగా, మోసం, రైతు ద్రోహం మరొకటి ఉండదని విమర్శించారు. సవాలక్ష కొర్రీలు, దిక్కుమాలిన ఆంక్షలతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను బ్యాంకులు, అధికారుల చుట్టూ పడిగాపులు గాచే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News