Monday, November 17, 2025
Homeపాలిటిక్స్Bhargava Ram: మేం వచ్చాక మీకు సెంట్రల్ జైళ్లు కూడా సరిపోవు

Bhargava Ram: మేం వచ్చాక మీకు సెంట్రల్ జైళ్లు కూడా సరిపోవు

వైసీపీని హెచ్చరిస్తున్న టీడీపీ నేతలు

2024లో తప్పకుండా టిడిపి అధికారంలోకి వస్తుందని, వైసిపి నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపటం మొదలుపెడితే సెంట్రల్ జైళ్లు కూడా సరిపోవని టీడీపీ నేత, భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ హెచ్చరించారు,. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదని భారతదేశంలోని రాజకీయ నాయకులందరూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వెంటనే విడుదల చేయాలని ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాస వద్ద టిడిపి నేతలు చేపట్టిన నాలుగవ రిలే నిరాహార దీక్షలో టిడిపి యువ నేత భార్గవరామ్ తో పాటు, చాగలమర్రి మండలం చాగలమర్రి మాజీ సర్పంచ్ అన్సర్ భాష న్యాయవాది నరసింహారెడ్డి సల్లా నాగరాజు, రుద్రవరం మండలం టిడిపి నాయకులు ముత్తలూరు రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు పోలా గురుమూర్తి, లక్ష్మికాంత్ యాదవ్, నంద్యాల పార్లమెంట్ యస్. సి సెల్ ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు, అల్లడి శేఖర్, కోటకొండ మాజీ ఎంపీటీసీ సత్యం రాజు, చిన్నకంబలూరు శ్రీను, డీలర్ నరసింహారెడ్డి, తువ్వపల్లె యువరాజు, పక్కిర గౌడ్, పత్తి నారాయణ,, రమణా రెడ్డి పలువురు కార్యకర్తలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad