Saturday, September 7, 2024
Homeపాలిటిక్స్Again gadida guddu campaign: మళ్లీ మొదలైన గాడిద గుడ్డు పోస్టర్లు

Again gadida guddu campaign: మళ్లీ మొదలైన గాడిద గుడ్డు పోస్టర్లు

మళ్లీ తెలంగాణలో గాడిద గుడ్డు పోస్టర్లు.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా అధికారంలో వున్న మోడీ సర్కార్.. చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని ప్రచారం చేసిన కాంగ్రెస్ మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్ లో తెలంగాణకు మోడీ సర్కార్ ఏమి ఇవ్వలేదని ఫైర్ తెలంగాణ నుండి 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ గాడిద గుడ్డు ఇచ్చిందని పోస్టర్లు వేసిన వైనం. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు బస్టాండ్లకు హోర్డింగ్ లకు గాడిద గుడ్డు పోస్టర్లు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో దక్కింది గాడిద గుడ్డు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News