Wednesday, February 12, 2025
Homeపాలిటిక్స్Comedian Prudhvi: పృథ్వీ నటించే సినిమాలన్నీ బాయ్ కాట్ చేస్తాం: వైసీపీ హెచ్చరిక

Comedian Prudhvi: పృథ్వీ నటించే సినిమాలన్నీ బాయ్ కాట్ చేస్తాం: వైసీపీ హెచ్చరిక

కమెడియన్ పృథ్వీ(Comedian Prudhvi)కి వైసీపీ మరో షాక్ ఇచ్చింది. పార్టీ శ్రేణులను పరుష పదజాలంతో దూషించిన పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కారుమూరు మండిపడ్డారు. ‘తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని చాలా పద్ధతిగా చెబుతున్నాం. కామ కుక్క పృథ్వీకి ఏ సినిమాలో అవకాశం ఇచ్చినా, ఏ సినిమా ఫంక్షన్ కు అతణ్ని పిలిచినా ఆ సినిమాను బాయ్ కాట్ చేస్తాం. అలానే ఆ నిర్మాత, ఆ హీరోల అన్ని మూవీలను పద్ధతి ప్రకారం బాయ్ కాట్ చేస్తాం’ అని హెచ్చరించారు.

ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఈ సినిమా నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను చేశారు. ఈ కార్యక్రమంలో హాస్య నటుడు పృథ్వీరాజ్ వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలకు తావిస్తోంది.

- Advertisement -

ఈ క్రమంలోనే ఎంతోమంది వైసిపి అభిమానులు ఈయన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీలో ఈ సినిమాని తప్పనిసరిగా బాయ్ కాట్ చేస్తామంటూ ఫైర్ అవుతున్నారు. ఇలా ప్రమోషన్సికి వచ్చిన ప్రతిసారి సినీ పరిశ్రమకు చెందినవారు తమ పార్టీని టార్గెట్ చేస్తూ ఉండటం సరైంది కాదన్నారు. తాజాగా పృథ్విరాజ్ సైతం ఈ సినిమాలో ఓ సన్నివేశం గురించి మాట్లాడుతూ వైసీపీకి వచ్చిన సీట్ల గురించి విమర్శలు కురిపించారని ఆ పార్టీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.

మేకల సత్యం అనే పాత్ర షూట్ జరిగేటప్పుడు ఒక సంఘటన చెప్పుకొచ్చారు. సినిమా గురించి మాట్లాడకుండా వైసిపి పార్టీకి వచ్చిన 11 సీట్ల గురించి పృధ్వి మాట్లాడటంతో వైకాపా అభిమానులు ఈ సినిమాని బాయికాట్ లైలా మూవీ (Laila Movie) అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కారుమూరు మండిపడ్డారు. ‘

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News