Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Irigela brothers of Allagadda: జనసేనలో చేరిన ఇరిగెల సోదరులు

Irigela brothers of Allagadda: జనసేనలో చేరిన ఇరిగెల సోదరులు

పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి..

ఆళ్లగడ్డ నియోజకవర్గ YCP నాయకులు ఇరిగేల రాంపుల్లారెడ్డి, బ్రదర్స్ జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇరిగెల బ్రదర్స్ ఇరిగెల రామచంద్రారెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి, ఇరిగెల విశ్వనాథరెడ్డి, ఇరిగెల ప్రతాప్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి కలిశారు. కండువా కప్పి పవన్ కళ్యాణ్ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ వారికి సూచించారు.

- Advertisement -

జనసేనలో చేరిన సందర్భంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ ..ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేనను బలోపేతం చేసి మరింత ముందు తీసుకెళ్తామన్నారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మా కార్యకర్తలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి దిశా దశ నిర్ణయిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న ఇరుగెల సోదరులు జనసేన పార్టీలో చేరడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News