ఫ్యాక్షన్ ప్రాంతాన్ని ఫ్రాక్షన్ రహిత సమాజంగా రూపు దిద్దాలనే సంకల్పంతో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 2009లో పునర్విభజనలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంగా కొత్తగా ఏర్పడింది. అంతకు మునుపు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన మండలాలు చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలు పెనుగొండ నియోజకవర్గంలో ఉండేవి. 2009లో నియోజకవర్గాలు పునర్విభజన కావడంతో చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాలు కలిసి రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడింది.
2009 సంవత్సరంలో టిడిపి తరఫున పరిటాల సునీత బరిలో నిలవగా కాంగ్రెస్ పార్టీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలిచారు. అప్పుడు పరిటాల సునీత కేవలం 1750 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. 2014లో తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల సునీత పోటీ లో నిలువగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా గాలి ఉండడంతో పరిటాల సునీత 7700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుండి ప్రకాష్ రెడ్డి బరిలో నిలిచారు. టిడిపి నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి 27,000 వేల పైచిలుకు ఓట్లతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటినుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఒకపక్క వైసిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 75 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో వేయగా 2 లక్షల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు కింద పాఠశాలలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయాలు నిర్మించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరు మండలాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించినట్లు తెలుస్తోంది. పేరూరు డ్యాముకు నీటిని తీసుకొచ్చి తద్వారా రైతుల భూములకు సాగునీరు అందించారు. అలాగే అనంతపురం రూరల్ మండలం లోని ఆలమూరు గ్రామం వద్ద తన సొంత నిధులతో 20 కోట్లు వెచ్చించి పాల డైరీని ఏర్పాటు చేసి తద్వారా పదివేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.
చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, అనంతపురం రూరల్ , ఆత్మకూరు మండలాల్లో దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో కొల్లాపూర్మ దేవత గుడి నిర్మాణానికి 15 లక్షలు, బీరప్ప దేవాలయానికి 10 లక్షలు, అనంతపురం రూరల్ మండలం పరిధిలోని ఒక గ్రామంలో మసీదుకు 11 లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా పలు దేవాలయ నిర్మాణాలకు కోట్ల రూపాయలు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అందజేసినట్లు సమాచారం అందుతోంది. పెళ్లిళ్లు చేయలేని తల్లిదండ్రులకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహాయ సహకారాలు అందజేశారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయంలో తోపుదుర్తి ఆర్థిక సాయం అందించి ఆదుకున్నట్లు పేరుంది.
రాప్తాడు నియోజకవర్గంలో బీసీ లీడర్లకే ప్రకాష్ రెడ్డి తగిన ప్రాధాన్యత ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలో జడ్పిటిసి, ఎంపీపీ పదవులు 80 శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ , ఎస్టి మైనార్టీలకు ప్రకాష్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తన సామాజిక వర్గానికి చెందినవారు ఎవరైనా తప్పు చేసిన వారిని ప్రకాశ్ రెడ్డి ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రకాష్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పరిటాల కుటుంబం విషయానికొస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత లేకుండా తన సొంత సామాజిక వర్గానికి చెందినవారికే పెద్దపీట వేశారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, అనంతపూర్ రూరల్, ఆత్మకూరు, మండలాల్లో తన సొంత సామాజిక వర్గానికి చెందినవారికే ప్రాధాన్యత ఇచ్చారని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కనగానపల్లి మండలంలో కురువ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీపీగా ఉంటే ఆ ఎంపీపీ పదవిని కూడా తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఆ పదవి కట్ట పెట్టినట్లు తెలుస్తోంది. సామాన్య కుటుంబానికి చెందిన పరిటాల కుటుంబానికి కోట్లాది రూపాయలు డబ్బులు ఎలా వచ్చాయని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎటువంటి ఫ్యాక్షన్ లేకుండా శాంతి భద్రతల కోసం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాప్తాడులో ఎటువంటి ఫ్రాక్షన్ హత్యలకు ప్రేరేపించకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పనిచేస్తున్నారని పలువురు చెబుతున్నారు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మరోసారి విజయం వరిస్తుందా?
2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సమీప ప్రత్యర్థి పరిటాల శ్రీరామ్ పై 27 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు రాప్తాడు వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉండగా టిడిపి పార్టీ తరఫున నుండి పరిటాల సునీత పోటీలో ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో వైసీపీ నుంచి ప్రకాష్ రెడ్డి, టిడిపి నుంచి పరిటాల సునీత, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ తో పాటు మరో పదిమంది అభ్యర్థులు ఇండిపెండెంట్గా రేస్ లో ఉన్నారు. అయితే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు పేరూరు డ్యాంకు నీరు తీసుకురావడం, చెన్నేకొత్తపల్లి మండలంలో దేవరకొండ ప్రాజెక్టు నిర్మాణానికి పనులు ప్రారంభించడం, సోమర వాండ్లపల్లి, పుట్ట కనుమ ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని తీసుకురావాలని సంకల్పంతో ప్రకాష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు ఆయన పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడం, దేవాలయ నిర్మాణాలకు లక్షల రూపాయల విరాళాలు ఇవ్వడంతో ఇవన్నీ కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయానికి లాభం చేకూరనున్నాయి. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ బోయ రాజేష్ ఇండిపెండెంటుగా నిలవడంతో తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలనుండడంతో తోపుదుర్తి విజయం నల్లేరు మీద నడికేనని పలువురు బాహాటంగా చెబుతున్నారు.