Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Assembly: బీజేపీ సక్సెస్ పురాణం చెప్పిన హరీష్ రావు

Assembly: బీజేపీ సక్సెస్ పురాణం చెప్పిన హరీష్ రావు

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీజేపీపై ధ్వజమెత్తిన హరీష్.. బీజేపీపై నిప్పులు చెరుగుతూ తన ప్రసంగాన్ని ఆద్యంతం కొనసాగించారు. బీజేపీ ఎందులో సక్సస్సో తెలుసా అంటూ.. ఆయన మాట్లాడిన మాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి.
జీడీపీని మంటగలపడంలో – సక్సెస్, ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో – సక్సెస్, 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో – సక్సెస్, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో – సక్సెస్, ఆకాశాన్ని తాకేట్టు సిలిండర్ ధర పెంచడంలో – సక్సెస్, పసిపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో – సక్సెస్, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో – సక్సెస్, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో – సక్సెస్, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో – సక్సెస్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో – సక్సెస్, ఆదానీ ఆస్తులు పెంచడంలో – సక్సెస్, రొటేషన్ లో వచ్చే G-20 ప్రెసిడెంట్ షిప్ ను తమ ఘనతగా చెప్పుకోవడంలో – సక్సెస్, మతపిచ్చి మంటలు రేపడంలో….. డబుల్ సక్సెస్..అంటూ హరీష్ ప్రసంగం సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News