Tuesday, July 15, 2025
Homeపాలిటిక్స్Azharuddin: ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా

Azharuddin: ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్

తనను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్ అన్నారు. యూసుఫ్ గూడా చెక్ పోస్టులోనీ మహమూద్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుంచి నియోజకవర్గం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి తాను ఈ నియోజకవర్గం ఎంచుకున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం పగలు రాత్రి కష్టపడి పని చేస్తానని ప్రకటించారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాములునాయక్, ఉపేందర్ రెడ్డి, భవాని శంకర్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News