Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Bandi challenges to Gangula: డాక్యుమెంట్లతో రా..నా ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు రెడీ

Bandi challenges to Gangula: డాక్యుమెంట్లతో రా..నా ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు రెడీ

మోదీ ఫొటోను డీపీగా పెట్టుకోండి

కమలాకర్ నన్ను అవినీతిపరుడంటున్నడు, నేను సవాల్ చేస్తున్న నేను అవినీతితో ఎంత ఆస్తి సంపాదించానో ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకుని రా… అవన్నీ బావూపేట సహా కరీంనగర్ ప్రజలందరికీ రాసిస్తా, అట్లాగే నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ నేను తీసుకొస్తా, వాటిని బావూపేట సహా కరీంనగర్ ప్రజలకు రాాసిస్తావా? నా సవాల్ కు సిద్ధమా ?అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించి రావాలని ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలోని బావూపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు హాజరై సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. గంగుల కమలాకర్ కొత్తకొత్త మాటలు చెబుతుండని, ఈసారి గెలిపిస్తే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి.. అందరికీ ఇండ్లు ఇస్తడట అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కంటే గొప్ప హిందువును తానేనని గంగుల ప్రచారం చేస్తున్నాడన్నారు.

- Advertisement -

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిగా పనిచేసినవ్, రేషన్ కార్డుల మంత్రివి కూడా నువ్వే… ఎంతమందికి రేషన్ కార్డులిచ్చినవ్, బీసీ మంత్రివి నువ్వే కదా బీసీ బంధు ఎంతమంది బీసీలకు ఇచ్చినవ్, 10 ఏళ్లుగా ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్ చూపెట్టాలన్నారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే… కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం 9 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. ఆర్వోబీ, స్మార్ట్ సిటీ, రోడ్లు, వీధి దీపాలుసహా గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే అభివ్రుద్ధి పనులకు కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చింది నేనే అన్నారు.

మోదీ గత 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఒక్క అవినీతి లేకుండా నేరుగా అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చారు.. మరి నేనడుగుతున్నా… కేసీఆర్ ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? ఎంత మందికి నిరుద్యోగ భ్రుతి ఇచ్చారో చెప్పాలి.

మీ కోసం నేను కొట్లాడిన. నిరుద్యోగుల కోసం పోరాడితే నన్ను అర్ధరాత్రి గుంజుకుపోయి జైల్లో వేశారు.. ఉద్యోగుల కోసం పోరాితే నా ఆఫీస్ ధ్వంసం చేసి నన్ను లాక్కుపోయి జైల్లో వేశారు. పండించిన వడ్లను కొనాలని రైతుల పక్షాన నేను ధాన్యం కేంద్రాలకు పోతే… నాపైనా, బీజేపీ కార్యకర్తలపైనా రాళ్ల దాడి చేసిర్రు. మీకు తెలుసా…. మీ కోసం నేను పోరాడితే కేసీఆర్ ప్రభుత్వం నాపై 74 కేసులు పెట్టారు. అయినా నేను భయపడలే.. మీకోసం ఎందాకైనా పోరాడతా అన్నారు.

ఇప్పుడు నేను కమలాకర్ ను అడుగుతున్నా… నేను 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చిన. లెక్క పత్రం నా దగ్గర సిద్ధంగా ఉంది. నువ్వు చేసిన అభివ్రుద్ధి ఏందో చర్చిద్దాం రా…అన్నారు. వచ్చే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News