Sunday, December 8, 2024
HomeతెలంగాణBandi Sanjay | 'రేవంత్ సీఎం అయితే కేటీఆర్ యాక్టింగ్ సీఎం'

Bandi Sanjay | ‘రేవంత్ సీఎం అయితే కేటీఆర్ యాక్టింగ్ సీఎం’

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే, కేసీఆర్ కొడుకు కేటీఆర్ యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ తో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని, అందుకే ఈ ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరంసహా అన్ని స్కాంలలో కేటీఆర్ ప్రధాన నిందితుడుని తేలిన తరువాత కూడా ఆయనను అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

‘‘ఒకనాడు జన్వాఢ ఫాంహౌజ్ పై డ్రోన్ ఎగరేశారనే కారణంతో నీ బిడ్డ పెళ్లిని కూడా చూడనీయకుండా నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు. అట్లాంటిది ఇయాళ బయటపడుతున్న స్కాంలన్నింట్లోనూ కేసీఆర్ కొడుకు ముద్దాయి అని తేలిన తరువాత కూడా ఎందుకు జైల్లో పెడతలేవ్. ఎందుకీ మీనమేషాలు’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ నిలదీశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ మీడియా మిత్రులతో ముచ్చటించారు.

Also Read : అడ్డొచ్చిన హోంగార్డుని ఈడ్చుకెళ్ళిన కారు

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్…

బండి సంజయ్, CM రేవంత్ ఒక్కటేనంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ (Bandi Sanjay) తిప్పి కొట్టారు. “కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అలుపెరగకుండా పోరాటం చేశాను. ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేసిండు. మేం ఫైటర్స్. అందుకే కేసీఆర్ కొడుకుకు నిద్రలో కూడా మేం గుర్తుకొస్తున్నం. అయితే కేసీఆర్ కొడుకుతో రేవంత్ రెడ్డి కలిసిపోయిండు. పగలు ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్లు నటిస్తరు. రాత్రి ఒక్కటైతున్నరు” అంటూ బండి కౌంటర్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి పాదయాత్రపై బండి రియాక్షన్…

“రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని సంగెం వద్ద మూసీ కోసం పాదయాత్ర చేస్తున్నడట. నేను నా పాదయాత్రలో ఆ ప్రాంతమంతా తిరిగిన. ప్రజల బాధలు కళ్లారా చూసిన. నేనడుగుతున్నా… రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సింది సంగెం వద్ద కాదు… మూసీ పునరుజ్జీవంతో ఇండ్లు కోల్పోతున్న బాధిత ప్రాంతాల్లో…. అక్కడ తిరిగితే కదా… పేదల కష్టాలు, కన్నీళ్లు తెలిసేది. ఆరు గ్యారంటీల విషయంలో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలి” అని బండి సంజయ్ రేవంత్ కి సవాల్ విసిరారు.

రేవంత్ కి బండి సంజయ్ విషెస్…

మరోవైపు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు బండి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News