రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికే 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారికి శాఖలను కేటాయించారు. భట్టీ విక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. కేబినెట్ లో బాధ్యతలు ఎవరికి ఏవి అప్పగించాలన్న విషయంపై నిన్న ఢిల్లీ వెళ్లొచ్చిన రేవంత్ మంత్రులకు శాఖలు కేటాయించారు.
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించగా, శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమల శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖ, హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి తనవద్దే ఉంచుకున్నారు.
కొండా సురేఖ అటవీ పర్యావరణం, దేవాదాయ శాఖ, సీతక్క మహిళా శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్ శాఖలు కేటాయించారు. ఇక మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కు రవాణా-బీసీ సంక్షేమం దక్కింది, మరోవైపు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తొలిసారి మంత్రి పదవి దక్కించుకోగా ఆయనకు సమాచార శాఖ దక్కింది. జూపల్ల కృష్ణారావుకు పర్యాటక-ఎక్సైజ్ శాఖ దక్కింది, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకైక కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర రావుకు వ్యవసాయం-చేనేత దక్కింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోడ్లు-భవనాలు-సినిమాటోగ్రఫీ దక్కగా మాజీ డిప్యుటీ సీఎం దామోదర్ రాజనరసింహకు వైద్య-ఆరోగ్యం దక్కింది. శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ దక్కింది.