Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Bhuma: బీసీలకు ప్రత్యేక చట్టం తెచ్చింది చంద్రబాబు నాయుడే

Bhuma: బీసీలకు ప్రత్యేక చట్టం తెచ్చింది చంద్రబాబు నాయుడే

చంద్రబాబుకు మద్దతుగా దీక్ష

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆళ్లగడ్డలో భూమా నివాసం వద్ద, 35వ రోజు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గం బీసీ సెల్ నాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, చేనేత, మత్స్యకార కార్పొరేషన్ లకు మొండిచేయి చూపి తీవ్రఅన్యాయం చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో వైసిపి నాయకులకు కార్పొరేషన్ల ద్వారా ప్రోటోకాల్ తో దౌర్జన్యాలు, అరాచకాలు చేయడానికి మాత్రమే పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పార్లమెంట్ బీసీ సెల్ స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయడమే కాకుండా కులవృత్తుల వారికి వారు చేతి వృత్తుల ద్వారా ప్రయోజనం పొందే దానికి వారికి కావలసిన పనిముట్లు, కుట్టు మిషన్లు, చిన్న తరహా పరిశ్రమలకు కావలసిన పరికరాలు అందజేసి బీసీలను ఆర్థికంగా మెరుగుపరిచే దానికి అనేక రకాల పథకాల ప్రవేశపెట్టారని అన్నారు. మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పింఛను ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సిరివెళ్ల మాజీ ఎంపీటీసీ కే బాలచంద్రుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై అక్రమ అరెస్టును మా బీసీ సంఘాల ద్వారా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ద్వారా ఖండిస్తున్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ బిసి సెల్ నాయకులు నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి చాంద్బాషా,లింగమయ్య, దూదేకుల మస్తాన్, గుర్రప్ప, పుల్లయ్య, శ్రీనివాసులు, రామతీర్థం, దూదేకుల మహబూబ్ బాషా, వీర మహేంద్ర చారి, లింగమయ్య, గౌడు, రమేషు, ఓబులేసు, యువరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News