శ్రీశైలం నియోజకవర్గంలో మైనార్టీ యువతికి ‘గడప గడపలో’ పించన్ ఇప్పిస్తామని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు రేప్ చేసిన సంఘటన వెలుగలోకి వచ్చిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిప్పులు చెరిగారు. మీడియా ముందు తనపై జరిగిన రేప్ రోదిస్తూ కంట కన్నీరు పెట్టుకున్న హృదయ విదారకంగా సంఘటన కలచివేస్తోందని అఖిలప్రియ శిల్పాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “భర్త మృతి చెందిన మైనార్టీ యువతికి పించన్ ఇప్పిస్తామని శిల్పా చక్రపాణి వద్ద పనిచేస్తున్న డ్రైవర్ శ్రీను మరో ఇద్దరు రేప్ చేసి, కేసు పెట్టడానికి వెళితే అపనిందలు వేయడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. అనుచరులను వెనకేసుకొస్తున్న మీవి ఏమి బతుకులు… యూజ్ లెస్ ఫెలోస్… మీ బతుకులు చెడా, సిగ్గులేని మీ బతుకులు ఒక బతుకేనా..థూ.. మీరూ రాజకీయ నాయకులేనా”.. అంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు.
“డ్రైవర్, అనుచరులు ఇలాంటి పనులు చేస్తుంటే గాడిదలు కాస్తున్నారా అని ఎద్దేవా చేశారు. గడప గడపకు దేనికి తిరుగుతున్నారు, ఇలాంటి నికృష్టమైన పనులు చేయడానికా అని ప్రశ్నించారు. ఆడపిల్లలను ఇలా చేస్తుంటే మీకు మర్యాద ఇవ్వాలా, మీ ఇళ్లలో ఆడపిల్లలు లేరా, మీకు కూతుర్లు లేరా మీరు రాజకీయ నాయకులా .. మీకా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తున్నది” అన్నారు. బాధితురాలు మాట్లాడుతూ పింఛన్ అడిగిన తనను ..శిల్పా వద్ద పనిచేస్తున్న డ్రైవర్ శ్రీను మరో ఇద్దరు ఆధారు, రేషన్ కార్డ్, ఫోటో తీసుకొని పోయారన్నారు. సంతకం చేయాలని చెప్పడంతో వెళ్లిన తనను భయపెట్టి రేప్ చేశారని మీడియా ముందు బాధిత మహిళ కన్నీటిపర్యంతమయింది. జరిగిన అన్యాయానికి పోలీస్ స్టేషన్ కు వెళితే కేసు నమోదు చేసుకోకుండా తనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ, బెదిరింపులకు గురిచేసినట్టు బాధితురాలు ఆరోపించింది.