Saturday, November 9, 2024
Homeపాలిటిక్స్Bhuma Bramhananda Reddy: నంద్యాలలో పెరిగిన నేరాలకు బాధ్యులు వారే

Bhuma Bramhananda Reddy: నంద్యాలలో పెరిగిన నేరాలకు బాధ్యులు వారే

శిల్పా ఛాలెంజ్ కు రెడీ

నంద్యాల పట్టణంలో క్రైం అరికట్టడంలో అధికారులు విఫలం అయ్యారని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. సృతివనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శిల్పా ఛాలెంజ్ కు సిద్ధమే అని భూమా సవాల్ విసిరారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలలో హత్యలు, మానభంగాలు, అనుమానస్పద మృతులు జరుగుతున్నా అసలైన నిందితులును పట్టుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారని అన్నారు. పాండురంగాపురంలోని శిల్పా వెంచర్ లో మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతిచెందిన స్పందించకపోవడం దారుణం అన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా, అధికారులు స్పందించాలని అన్నారు. వెంచర్లో బాలికను రేప్ చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రచార మాధ్యమాల్లో వచ్చినా పోలీసులు సరైన సమాధానం చెప్పాలేదన్నారు. బాధిత కుటంబానికి శిల్పా కుటుంబం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో కొందరిని అరెస్ట్ చేసినా విడుదల అయ్యి దర్జాగా తిరుగుతున్నారని అన్నారు. కానిస్టేబుల్ హత్యలో అసలు సుత్రదారుడిని పోలీసులు పట్టుకోవాలని, వెనకవుండి నడిపించిన వారి వివరాలు బయటపెట్టాలని అన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కానిస్టేబుల్ హత్య గురించి మాట్లాడినా నేటికీ సమాధానం లేదన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం సెల్ఫీలు తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ ఉద్యోగి ఒకరు .. నా చావుకు మాజీ కౌన్సిలర్ కన్నమ్మ అంటూ సెల్ఫీ తీసుకొని మృతి చెందినా మసిపూసి మరేడుకాయ చేశారని అన్నారు. నాలుగేళ్లుగా నంద్యాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎన్నోసార్లు చెప్పినా స్పందించని శిల్పా, నేడు ఎన్నికలు వస్తున్నాయని అభివృద్ధికి ఛాలెంజ్ అని చెప్పడం విడ్డూరంగా వుందని అన్నారు.

- Advertisement -

తెలుగుదేశం పార్టీ తరపున బహిరంగ చర్చకు సిద్ధమని, ప్లేస్ ఎక్కడో, ఎప్పుడో చెపితే సిద్ధమని భూమా సవాల్ విసిరారు. శిల్పా రవి అనుచరుడు చెండ్రాయుడు మద్యం విక్రయిస్తూ సెభ్ అధికారులకు దొరికితే కేవలం నాలుగు బాటిల్స్ చూపించడంలో మర్మం అందరికీ తెలుసన్నారు. నాలుగు బాటిల్స్ కాదు నాలుగు లోడ్లు తరలించారని, అధికారులు నిజానిజాలు బయటికి తీసుకురావాలని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ మహబూబ్ వలి, కన్వీనర్ చంద్ర శేఖర్ రెడ్డి, నంద్యాల మైనారిటీ ప్రధాన కార్యదర్శి మస్తాన్ బాబా, కౌన్సిలర్ నాగార్జున, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దికెర కైలాష్, అడ్వకేట్ నరేంద్ర కుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు గౌస్ భాయ్, వార్డ్ ఇంఛార్జిలు రాంపల్లె రామి రెడ్డి, అమిదెలా చందు, జియా భాయ్, బుజ్జి, గూడ శివ శంకర రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గుద్దేటి వెంకటేశ్వర్లు, మంజుల వెంకట స్వామి, మంజుల సుబ్బారాయుడు, నసీరా బేగం, వారీష్, గుర్రం లక్ష్మి, రాజ శేఖర్, మబు గుల్లి, దూదేకుల దస్తగిరి, హుస్సేన్, కమల్ బాషా, పివి నగర్ మధు, నరసింహ, బాబా ఫాక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News