దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రైతుల బాగుకోసం 69 జీఓను ఇస్తే, తనయుడు-ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ భూమా బ్రహ్మా నందరెడ్డి ఆరోపించారు. జగన్ కు తెలంగాణా ప్రభుత్వంపై ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ రైతుల్ని సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తులసివనంలో రైతులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఈ సందర్భంగా ..కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల కష్టాలు గుర్తించి 69 జీఓను తెచ్చారన్నారు. శ్రీశైలంలో 854 అడుగులకు తక్కువగా నీళ్ళుంటే ఎవరికీ వదలకూడదని జీఓ తెచ్చారని గుర్తుచేశారు. తండ్రి రైతుల కోసం జీఓ తెస్తే తనయుడు తండ్రి ఆశయాలను తుంగలో తొక్కి మన ప్రాంత రైతులకు నీరు ఇవ్వకుండా తెలంగాణా ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తికి నీళ్ళు వదులుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణాకు 10 క్యూసెక్కుల నీళ్ళు వదలుతూ, మన ప్రాంత రైతులకు ఒక్క క్యూసెక్కు నీరు ఇవ్వలేకపోవడం రైతులపై ఎంత ప్రేమ వుందో చెబుతుందన్నారు. ఖరీఫ్ సీజన్ లో నీళ్ళు వదలాలని కలెక్టర్ కార్యాలయంలో ఇంఛార్జి మంత్రి, కలెక్టర్, అధికారులతో తమ గోడు చెప్పుకోవాలని వచ్చిన రైతులతో మాట్లాడకుండా పోలీసులతో అడ్డగించడం దారుణమన్నారు. ఈ సమావేశంలో కొమ్ము హరి, జగదీష్, చెన్నయ్య, చలపతి, విశ్వనాథ రెడ్డి, శ్రీను, సతీష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Bhuma Bramhananda Reddy: వైయస్ ఇచ్చిన 69 జీఓను నిర్వీర్యం చేస్తున్న జగన్
తెలంగాణపై సీఎం జగన్ కు అంత ప్రేమెందుకో?